/rtv/media/media_files/2025/05/15/tqrxZZE11363FULPzozz.jpg)
Sudheer Babu
Sudheer Babu: టాలెంటెడ్ యాక్టర్ సుధీర్‌బాబు అభిమానులకు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చారు. ఆయన తదుపరి సినిమా అధికారికంగా అనౌన్స్ చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ కొత్త ప్రాజెక్టుకు ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వం వహించనున్నారు.
Also Read: 'ఈట్.. స్లీప్.. సలార్'.. బొమ్మ వచ్చి 500 రోజులు దాటినా ఊపు తగ్గలేదుగా!
"బ్రోకెన్ సోల్.. ఆన్ ఏ బ్రూటల్ సెలబ్రేషన్"
ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-లుక్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అందులో మెట్ల మీద విరిగిపడిన శరీరాలు కనిపించగా, వాటి మధ్య షర్ట్ లేకుండా చేతిలో పవర్ఫుల్ ఆయుధంతో నడుస్తూ సుధీర్ బాబు ఓ ఉగ్రరూపంలో దర్శనమిచ్చారు. "బ్రోకెన్ సోల్.. ఆన్ ఏ బ్రూటల్ సెలబ్రేషన్" అనే ట్యాగ్‌లైన్ పోస్టర్ పై మెయిన్ హైలైట్ గా నిలిచింది.
Silence breaks.. Violence rises..
— Sudheer Babu (@isudheerbabu) May 11, 2025
Joining forces with @peoplemediafcy backed by the relentless vision of @vishwaprasadtg garu & @rsnaidu44 once again- the man behind Nannu Dochukunduvate.
This time, it's not just emotions… it's mayhem..#PMFxSB#krithiprasad pic.twitter.com/0SSSmc76xR
ఈ చిత్రం ఒక సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌గా(Survival Action Thriller) రూపొందనుందని సమాచారం. ఇందులో సుధీర్ ఇప్పటివరకు ఎప్పుడూ చూడనట్లు బీస్ట్ మోడ్‌లో కనిపించబోతున్నారు. పాత్ర కోసం ఆయన తన శరీరాకృతిలో భారీ మార్పులు చేసుకున్నారని చిత్రబృందం వెల్లడించింది.
Also Read: ఈ రేంజ్ కలెక్షన్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా! #సింగిల్ వరల్డ్ వైడ్ ఎంతంటే..?
ఈ సినిమాతో ప్రేక్షకులకు కొత్త యాక్షన్ అనుభూతి ఇవ్వాలనే లక్ష్యంతో చిత్ర బృందం పని చేస్తోంది. ఇంకా నటీనటులు, ఇతర టెక్నికల్ టీమ్ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Also Read: బాలయ్య కొత్త ఆయుధం రెడీ.. ఇక దబిడి దిబిడే..!