SSMB29 Latest Updates: రాజమౌళి ట్విస్ట్ మాములుగా లేదుగా.. ఇక థియేటర్లు తగలబడిపోతాయి

మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 సినిమాకు సంబంధించి ఒక వార్త ఫుల్ వైరల్ అవుతోంది. మహేష్ తో జోడీగా ప్రియాంక చోప్రా కనిపిస్తారని అంతా అనుకున్నారు, కానీ ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతోందట దీంతో ఈ సినిమాపై హైప్ ఇంకా పెరిగిపోయింది.

New Update
ssmb29 latest updates

ssmb29 latest updates

SSMB29 Latest Updates: SSMB29 ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి(SS Rajamouli) డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా గురించి అంతర్జాతీయ స్థాయిలో మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతటి అంచనాలు ఉన్న ఈ మూవీ గురించి  వస్తున్న లీక్స్ కూడా ఫాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తున్నాయి. 

పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా..

ఇటీవల SSMB29 గురించి కొత్త టాక్ ఒకటి బయటకి వచ్చింది. మహేష్ బాబుతో జోడీగా ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కనిపిస్తారని అంతా అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. అలాగే, పృథ్వీరాజ్ సుకుమారన్(Prudhvi Raj Sukumaran) విలన్‌గా నటించనున్నారని మూవీ యూనిట్ ముందే హిట్ ఇచ్చినా, ఇప్పుడు ఆయన స్థానంలో బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహం(Jhon Abraham) తీసుకోవచ్చని టాక్ నడుస్తోంది. ఏది ఏమైనప్పటికి ఈ విషయాలనింటికి త్వరలోనే ఎండ్ కార్డు పడనునట్లు సమాచారం. 

Also Read: Mastan Sai : డ్రగ్స్ ఇస్తాడు.. న్యూడ్ వీడియోలు తీస్తాడు..  మస్తాన్ మాములోడు కాదయ్యా!

ఇటీవల ప్రియాంక చోప్రా షూట్ గ్యాప్ తీసుకుని ముంబై వెళ్లిపోయారు, ఆమె సోదరుడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లి ఉన్నందున ఆమె లేకుండా మిగతా సీన్స్ షూట్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో కొన్ని కీలక సీన్స్ షూట్ చేస్తున్నారని తెలుస్తోంది.

Also Read: Sekhar Basha: శేఖర్ బాషాకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు..

మొత్తం దాదాపు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో SSMB29 దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోంది. అయితే ఈ మూవీ రెండు పార్ట్ లుగా విడుదల కానుంది. మొదటి భాగం 2027లో, రెండవ భాగం 2028లో రిలీజ్ అవుతాయని ఒక అంచనా. ఏది ఏమైనప్పటికి ఈ మూవీ పై వస్తున్న పుకార్లు మాత్రం సినిమాకి కావాల్సినంత హైప్ ని పెంచేస్తున్నాయి.

Also Read: గిరిజన యువతులు నల్లగా, అంద వికారంగా.. ఒడిశా సీఎం చీప్ కామెంట్స్!

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు