Rajamouli: ‘SSMB29’ ఈవెంట్‌ డిటైల్స్ .. స్పెషల్‌ వీడియోతో రాజమౌళి క్లారిటీ..!

మహేష్ బాబు, రాజమౌళి కలయికలో వస్తున్న ‘SSMB29’ గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. పాస్ ఉన్నవారినే అనుమతిస్తారని రాజమౌళి తెలిపారు. ప్రియాంక చోప్రా లుక్ వైరల్ కాగా, ఇప్పుడు అభిమానుల మహేష్ లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు.

New Update
Rajamouli

Rajamouli

Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కలయికలో వస్తున్న భారీ చిత్రం ‘SSMB29’ (Globetrotter) చుట్టూ అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. ఈ సినిమా నుంచి ప్రతి అప్‌డేట్ కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

నో పాస్‌.. నో ఎంట్రీ: ఎస్‌.ఎస్‌. రాజమౌళి (Globetrotter Event Details)

ఈ చిత్రానికి సంబంధించిన మొదటి ఈవెంట్ “గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్” నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి ప్రత్యేక వీడియో విడుదల చేసి అభిమానులకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఈ ఈవెంట్‌కు కేవలం పాస్‌లు ఉన్న వారినే అనుమతిస్తారని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న “ఎవరైనా వెళ్లొచ్చు” అనే వార్తలను నమ్మొద్దని హెచ్చరించారు. అభిమానులందరూ క్రమశిక్షణగా వ్యవహరించాలని, ఈవెంట్‌ను జియో హాట్‌స్టార్‌లో లైవ్‌గా వీక్షించవచ్చని తెలిపారు.

Also Read: భార్యాభర్తల మధ్య లొల్లి పెట్టిన కుక్క.. కోర్టు మెట్టులెక్కిన భర్త!

ఇప్పటికే ఈ సినిమా నుంచి నటుడు పృథ్విరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా జోనస్ ల ఫస్ట్ లుక్స్ విడుదలై సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా ప్రియాంక చోప్రా ‘మందాకిని’ లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. పసుపు చీరలో గన్ పట్టుకుని కనిపించిన ఆమె కేవలం కొద్ది నిమిషాల్లోనే ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.

ఇప్పుడు అందరి దృష్టి మహేష్ బాబు ఫస్ట్ లుక్ పైనే ఉంది. ఆయన లుక్ ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. సమాచారం ప్రకారం మహేష్ బాబు ఫస్ట్ లుక్ నవంబర్ 14న విడుదల కావచ్చని చెబుతున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆ లుక్‌ను నవంబర్ 15న జరగబోయే ప్రత్యేక ఈవెంట్‌లోనే ఆవిష్కరించనున్నారని అంటున్నారు.

Also Read: మొత్తం విప్పేసి.. డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ హాట్ షో అందాలు.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!

రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ప్రెజెంటేషన్, అద్భుతమైన విజువల్స్ ఉంటాయి. కాబట్టి మహేష్ బాబు లుక్ ఆ ఈవెంట్‌లో ఘనంగా విడుదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

సోషల్ మీడియాలో ఇప్పటికే అభిమానులు హ్యాష్‌ట్యాగ్‌లతో ఊహాగానాలు మొదలుపెట్టారు. “మహేష్ గ్లోబల్ అవతార్ ఎలా ఉంటుంది?”, “రాజమౌళి ప్రెజెంటేషన్ ఏ స్థాయిలో ఉంటుంది?” వంటి ప్రశ్నలు నెట్‌లో హీట్‌గా మారాయి.

Also Read: Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్ లో సంచలన విషయాలు..పేలుళ్లలో మహిళా ఉగ్రవాదుల పాత్ర

‘గ్లోబ్‌ట్రాటర్’ మహేష్ బాబు కెరీర్‌లోనే కాదు, భారతీయ సినీ చరిత్రలో కూడా ఒక పెద్ద మైలురాయి అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో షూటింగ్ జరగబోయే ఈ సినిమా యాక్షన్, అడ్వెంచర్, డ్రామా అంశాలతో తెరకెక్కనుంది.

Advertisment
తాజా కథనాలు