'RRR' కు మించి ఆ సీన్స్ ఉంటాయి.. 'SSMB29' పై రాజమౌళి బిగ్ అప్డేట్

'SSMB29' మూవీపై రాజమౌళి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఓ అంతర్జాతీయ ఈవెంట్‌కు హాజరైన ఆయన.. మహేశ్‌తో తీస్తున్న సినిమాలో 'RRR'లో ఉన్న జంతువుల కంటే ఎక్కువ జంతువులు ఉంటాయని అన్నారు. జనవరిలో ఈ మూవీ షూటింగ్ మొదలుకానుంది. రెండు భాగాలుగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతుంది.

New Update
fbc

SS Rajamouli: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి నుంచి ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ 'SSMB29'. 'RRR' లాంటి పాన్ ఇండియా హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో దేశ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

Also Read: రైతుకు తెలీకుండానే రూ.20 లక్షల లోన్ .. బ్యాంకుకెళ్లి చూస్తే?

రీసెంట్ గా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ ఈవెంట్ లో మహేష్ - రాజమౌళి సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి మొదలు కానుందని చెప్పారు. ఇక తాజాగా ఈ మూవీపై రాజమౌళి స్వయంగా బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఓ అంతర్జాతీయ ఈవెంట్‌కు హాజరైన ఆయన.. మహేశ్‌తో తీస్తున్న సినిమాలో ఆర్‌ఆర్‌ఆర్‌లో ఉన్న జంతువుల కంటే ఎక్కువ జంతువులు ఉంటాయని అన్నారు.

Also Read: వామ్మో! అంత ఖరీదైన రిసార్టులో పూజ బర్త్ డే.. ఒక్కరోజుకు ఎన్ని లక్షలంటే?

 'RRR' కు మించి..

" నాకు జంతువులంటే ఇష్టం. 'RRR'తో సహా గతంలో నేను తీసిన సినిమాల్లో జంతువులను ఉపయోగించాను. ఒక విషయం అయితే కచ్చితంగా చెప్పగలను. 'RRR' కంటే ఎక్కువ జంతువులు నా తదుపరి మూవీస్‌లో ఉంటాయి.." అంటూ చెప్పుకొచ్చారు. ఈ అప్డేట్ తో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. జక్కన్న చెప్పినదాన్ని బట్టి చూస్తే 'SSMB29' హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని అర్థమవుతుంది. 

Also Read: BiggBoss ప్రియాంక సింగ్ ఇంట విషాదం.. తండ్రి చనిపోయారని ఎమోషనల్ పోస్ట్!

మహేష్ సినిమా కోసం ఇప్పటికే కొన్ని హాలీవుడ్ సినిమాలను అదిరిపోయే విజవల్స్ అందించిన 'ఏ స్టూడియోస్' తో రాజమౌళి కలిసి పనిచేస్తున్నారు. ప్రెజెంట్ ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. రెండు భాగాలుగా ఈ ప్రాజెక్ట్ ను రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: 'దేవర' నుంచి ఆయుధ పూజ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..

Advertisment
Advertisment
తాజా కథనాలు