Sreeleela: అల్లు అర్జున్ కు శ్రీలీల స్పెషల్ గిఫ్ట్.. అందులో ఏముందంటే?

శ్రీలీల.. అల్లు అర్జున్ కు స్పెషల్ గిఫ్ట్స్ పంపించింది. బన్నీతోపాటు స్నేహారెడ్డి, పిల్లలకు కూడా గిఫ్ట్స్ ఇచ్చింది.కలర్ లెటర్స్ పై తన అభిప్రాయాలను రాసి గిఫ్ట్ ప్యాక్స్ గా వారికి పంపించింది. వాటిని బన్నీ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ శ్రీలీలకు థాంక్స్ చెప్పాడు.

New Update
ergfd

టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో స్టెప్పులేయబోతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ తెరకెక్కిస్తున్న 'పుష్ప ది రూల్' మూవీలో శ్రీలీల స్పెషల్ సాంగ్ లో మెరవనుంది. రీసెంట్ గా ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. శ్రీలీల బన్నీతో కలిసి స్టెప్పులేయనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ శ్రీలీల స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. 

దీంతో 'పుష్ప 2' మూవీపై హైప్ మరింత పెరిగింది. ఇదిలా ఉంటే తాజాగా బన్నీకి స్పెషల్ గిఫ్ట్స్ పంపించింది శ్రీలీల. బన్నీతోపాటు అతడి భార్య స్నేహారెడ్డి, పిల్లలకు కూడా అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చింది. కలర్ లెటర్స్ పై తన అభిప్రాయాలను రాసి గిఫ్ట్ ప్యాక్స్ గా వారికి పంపించింది. వాటిని బన్నీ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ శ్రీలీలకు థాంక్స్ చెప్పాడు. అలాగే ఆమెను డ్యాన్సింగ్ క్వీన్ అంటూ పిలవడం విశేషం.

publive-image

Also Read : శివకార్తికేయన్ 'అమరన్'.. థియేటర్ పై బాంబు దాడి

' నువ్వు పంపించిన గిఫ్ట్స్ ఇప్పుడే చూశాను. అందులో నువ్వు రాసిన లెటర్ లో ని మాటలు నా మనసును తాకింది. నీ ప్రేమకు నా కృతజ్ఞతలు..' అంటూ బన్నీ.. శ్రీలీలకు రిప్లై ఇచ్చాడు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఫ్యాన్స్ నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. 

భారీ రెమ్యునరేషన్ 

'పుష్ప ది రూల్' మూవీలో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి హీరోయిన్ గా దూసుకుపోయిన ఈ యంగ్ బ్యూటీ.. ఇప్పుడిప్పుడు ఐటెం సాంగ్ లపై ఆసక్తి చూపిస్తోంది. ఇందులో భాగంగానే పుష్ప 2లో ఐటెం సాంగ్ కు భారీగా పారితోషికం తీసుకుందని టాక్ వినిపిస్తోంది. దాదాపు రూ.2 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే శ్రీలీల ఇంత మొత్తంలో తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

Also Read : ఆ హీరోయిన్ నాతో చేయనని ముఖం మీదే చెప్పింది,చాలా బాధపడ్డా: విశ్వక్ సేన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు