/rtv/media/media_files/2024/11/16/OxFjRw5p2j3KpDVYr47Z.jpg)
కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ నటించిన 'అమరన్' మూవీ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, అశోక చక్ర గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 31 న థియేటర్స్ లో రిలీజైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.
ఇదిలా ఉంటే 'అమరన్' మూవీ నడుస్తున్న ఓ థియేటర్ పై బాంబు దాడి జరిగింది. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఈ సినిమా నడుస్తున్న అలంగర్ థియేటర్‌పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు బయటికి రాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి.
திருநெல்வேலியில் அமரன் படத்தை திரையிட இருந்த திரையரங்கின் மீது மர்ம நபர்கள் பெட்ரோல் குண்டு வீச்சு...#Tirunelveli #Amaran #Sivakarthikeyan #PetrolBomb #IBCTamil pic.twitter.com/ROvazZVKGk
— IBC Tamil (@ibctamilmedia) November 16, 2024
Also Read : ఆ హీరోయిన్ నాతో చేయనని ముఖం మీదే చెప్పింది,చాలా బాధపడ్డా: విశ్వక్ సేన్
కారణం అదేనా..
మరోవైపు ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఇక ఈ దాడిలో ఎవరికి గాయాలు కాలేదని.. స్థానిక గొడవల కారణంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా ఇలా ఉన్నట్టుండి థియేటర్ పై బాంబు దాడి జరగడం ఆడియన్స్ ను భయాందోళనకు గురి చేసింది.
A petrol bomb was hurled at Alankar Cinema in Melapalayam, Nellai district, where the Tamil film Amaran was being screened. The incident occurred early morning, with the bomb being thrown in front of the cinema premises.
— E.Suganya🚩🇮🇳 (@suganya3689) November 16, 2024
This is a picture paying tribute to a fallen soldier. If… pic.twitter.com/0JYIQM44d7
ఇక 'అమరన్' మూవీకి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ.200 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేయడమే కాకుండా శివకార్తికేయన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు.
Also Read : నయనతారపై ధనుష్ కేసు.. 10 కోట్లు డిమాండ్, హీరోయిన్ సంచలన ఆరోపణలు