ఆ హీరోయిన్ నాతో చేయనని ముఖం మీదే చెప్పింది,చాలా బాధపడ్డా: విశ్వక్ సేన్

విశ్వక్ సేన్ ఓ ఈవెంట్ లో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. 'ఫలక్ నుమా దాస్' కథ చెప్పడం కోసం శ్రద్ధా శ్రీనాథ్ ను కలిస్తే ఆమె నో చెప్పిందని, అప్పుడు చాలా ఫీలయ్యానని, ఇప్పుడు ఆమె తన మూవీలో చేస్తుంటే ఆనందంగా ఉందని అన్నాడు.

New Update
sdfs

యంగ్ హీరో విశ్వక్ సేన్ చాలా తక్కువ టైం లోనే ఇండస్ట్రీలో స్టార్ డం సంపాదించుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని హీరోగా నిలదొక్కుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ ఆయన మినిమం గ్యారెంటీ హీరోగా నిలిచి 'మాస్ కా దాస్' అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్నాడు. అలాంటిది విశ్వక్ సేన్ తో ఓ హీరోయిన్ నటించనని ముఖం మీదే చెప్పిందట. తాజాగా ఈ విషయాన్ని విశ్వక్ బయటపెట్టాడు.

Also Read : నయనతారపై ధనుష్ కేసు.. 10 కోట్లు డిమాండ్, హీరోయిన్ సంచలన ఆరోపణలు

విశ్వక్ సేన్ త్వరలోనే 'మెకానిక్‌ రాకీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రవితేజ ముళ్ళపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్ తాజాగా ఓ  ఓ కాలేజీ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో సినిమా విషయాలతో పాటూ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.

చాలా ఫీలయ్యాను..

' 'ఫలక్‌నుమా దాస్‌' సినిమాకు మొదట శ్రద్ధా శ్రీనాథ్‌నే హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నాను. ఆమెకు కథ చెప్పడం కోసం బెంగళూరు దాకా వెళ్లాను. తీరా వెళ్లాక ఆమె నో చెప్పింది. డబ్బుల్లేకపోయినా ఖర్చుపెట్టుకుని మరీ బెంగళూరు వెళ్లా.. అనుకున్న పని జరగలేదని చాలా ఫీలయ్యాను. ఇప్పుడు ఆమె నా సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్‌ చేస్తుంటే భలే ఆనందంగా ఉంది..' అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు