Single Trailer తాజాగా విడుదలైన శ్రీవిష్ణు 'సింగిల్' ట్రైలర్ పక్కా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తోంది. 20 గంటల్లోనే మిలియన్ పైగా వ్యూస్ యూట్యూబ్ లో నెంబర్ 1 ట్రెండింగ్ గా దూసుకెళ్తోంది. అయితే ఈ ట్రైలర్ లో మంచు ఫ్యామిలీ టార్గెట్ గా డైలాగ్స్ ఉండడం అందరి దృష్టిని ఆకర్షించింది.
Orey 😂😂😂🤣🤣😭😭
— Vamc Krishna (@lyf_a_zindagi) April 28, 2025
Enni sarlu chusina navvu agatledu kadayya @sreevishnuoffl#SreeVishnu#Singlepic.twitter.com/r5JRlpgEr2
"శివయ్యా..."
'కన్నప్ప' టీజర్ లో మంచు విష్ణు "శివయ్యా..." అని ఎలా అరుస్తాడో.. శ్రీవిష్ణు కూడా 'సింగిల్' ట్రైలర్ లో ''శివయ్య.. అంటూ అదే టోన్ లో అరవడం నెట్టింట వైరల్ గా మారింది. ట్రైలర్ కామెంట్ సెక్షన్ లో ఈ డైలాగ్ ని హైలైట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ''శివయ్య.. కన్నప్ప ట్రోలింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి మంచు విష్ణు దీనీపై ఎలా స్పందిస్తారో చూడాలి. దీనిని స్పోర్టివ్‌గా తీసుకుంటారా? లేదా? రియాక్ట్ అవుతారా?.. ఒకవేళ మంచు ఫ్యామిలీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తే.. ఫైనల్ కట్‌లో ఈ డైలాగ్స్ ఉంటాయా.? అనేది ఆసక్తికరంగా మారింది.
latest-news | cinema-news | film-news | manchu-vishnu | kannappa | sree-vishnu