Single Movie Collections: దిమ్మ తిరిగేలా 'సింగల్' కలెక్షన్స్.. రెండు వారాల్లో ఎన్ని కోట్లంటే..?

శ్రీ విష్ణు నటించిన ‘సింగిల్’ మూవీ మే 9న విడుదలై సెన్సేషనల్ సక్సెస్‌గా నిలిచింది. బుక్ మై షోలో ఒక్క శనివారం రోజే 32,460 టికెట్లు అమ్ముడవ్వగా, ఇప్పటివరకు ఈ సినిమా రూ. 25 కోట్ల గ్రాస్ వసూలు చేసి రెండో వారం కూడా అదే జోష్‌తో థియేటర్లలో రన్ అవుతోంది.

New Update

Single Movie Collections: యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘సింగిల్’ సెన్సేషనల్ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. మే 9న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, తొలి వారంలోనే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లగా, ఇప్పుడు రెండో వారం గడుస్తున్నా అదే జోష్‌ను కొనసాగిస్తోంది. చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, శనివారం ఒక్క రోజులోనే బుక్ మై షో ద్వారా 32,460 టికెట్లు అమ్ముడవ్వడంతో సినిమాకు ఉన్న క్రేజ్‌ ఏ లెవెల్ లో ఉందొ తెలుస్తోంది. 

Also Read: 'రెట్రో' లెక్కలివే.. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్..!

రూ. 25 కోట్ల గ్రాస్

ఇప్పటికే ఈ సినిమా రూ. 25 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 15 కోట్లు, ఇతర ప్రాంతాల నుంచి మరో రూ. 7 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఆదివారం మరింత బిజీగా ఉండే అవకాశం ఉండటంతో, ఈ వారం చివరికి రికార్డు కలెక్షన్స్ రాబడుతుందని అంచనా..

కేవలం కామెడీ ఎంటర్‌టైనర్ అనే ట్యాగ్‌ మాత్రమే కాకుండా, ‘సింగిల్’ ఓ యూత్‌ఫుల్ ఎమోషనల్ జర్నీగా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఒక సాధారణ యువకుడి జీవితం, ప్రేమ కథ, తను ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ హాస్యం, భావోద్వేగాలతో మిక్స్‌ చేస్తూ అందంగా తీసిన  ఈ కథ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.

Also Read: 'శుభం' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమంత.. చీర లుక్‌ అదిరింది! (ఫోటోలు)

శ్రీ విష్ణు నటన ఈ సినిమాలో హైలైట్‌గా నిలవగా, కేతికా శర్మ, ఇవనా, వెన్నెల కిషోర్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక సినిమాకు సంగీతం అందించిన విశాల్ చంద్రశేఖర్ ట్యూన్స్‌కి యూత్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. కార్తిక్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, సింపుల్ కాన్సెప్ట్‌తోనే ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.

Also Read: మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా పాజిటివ్.. ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్

'సింగిల్'తో పాటు విడుదలైన ఇతర సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ మూవీకి క్రేజ్ మరింతగా పెరిగింది. బ్రేక్ ఈవెన్ ఇప్పటికే పూర్తయిందనీ, డిస్ట్రిబ్యూటర్లకు అన్ని ఏరియాల్లోనూ ప్రాఫిట్స్ వస్తున్నాయి తెలుస్తోంది.

మొత్తానికి, ‘సింగిల్’ సినిమా శ్రీ విష్ణు కెరీర్‌లో మరో హిట్ గా నిలుస్తోంది. శ్రీ విష్ణు మినిమం గ్యారెంటీ హీరో అని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ మూవీ రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సిందే!

Also Read: చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ ఇంట్లో విషాదం.. తల్లి కమలహాసిని మృతి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు