/rtv/media/media_files/2025/05/19/jU5EpOrXkXklcNYpndai.jpg)
child artist master Bharath mother passed away
Child Artist: చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగులో అనేక సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అతడి తల్లి కమలహాసిని ఆదివారం చెన్నైలో మరణించారు. ఈ నేపథ్యంలో తోటి నటీనటులు, అభిమానులు భరత్ కి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. పలు నివేదికల సమాచారం ప్రకారం.. భరత్ తల్లి కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో తుది శ్వాశ విడిచారు.
80 కి పైగా చిత్రాల్లో
భరత్ తెలుగులో 80 కి పైగా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అల్లుడు శీను, దూసుకెల్తా, యముడికి మొగుడు, దేనికైనా రెడీ, మిస్టర్ పర్ఫెక్ట్, అందాల రాముడు, పోకిరి, బాద్‌షా వంటి అనేక చిత్రాల్లో తన కామెడీ టైమింగ్ కడుపుబ్బా నవ్వించారు.
latest-news | telugu-news | Master Bharat Mother Passed Away