/rtv/media/media_files/2025/08/08/spirit-casting-call-2025-08-08-16-18-36.jpg)
Spirit Casting Call
Spirit Casting Call: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందనున్న భారీ చిత్రం "స్పిరిట్"(Spirit Movie) కోసం కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు మూవీ టీం. ఇంకా షూటింగ్ మొదలవ్వక ముందే ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి, ఇప్పుడు చిత్రబృందం 13 నుండి 17 ఏళ్ల మధ్య వయసున్న మేల్ యాక్టర్స్ కోసం ఓ ప్రత్యేకమైన కాస్టింగ్ కాల్ విడుదల చేసింది.
ఈ కాస్టింగ్ కాల్ ద్వారా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉన్న యువ నటులకు ప్రభాస్‌తో కలిసి నటించే అరుదైన అవకాశం లభించనుంది. ఈ చిత్రం రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో "టీ సిరీస్", "భద్రకాళి పిక్చర్స్" సంస్థలు నిర్మించనున్నాయి. సెప్టెంబరు చివరలో షూటింగ్ మొదలవ్వనుండగా, ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
Also Read: అరాచకం సామి ఇది.. సెప్టెంబర్ నుండి స్పిరిట్ నాన్ స్టాప్ కొట్టుడే..!
ఎవరు అప్లై చేయవచ్చు?
ఈ ఆడిషన్స్ లో పాల్గొనాలనుకునే అభ్యర్థులు..
- 13 నుండి 17 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
- చిన్న వయసులో ఉన్న ప్రభాస్ పాత్రకి తగినట్లు ఉండేలా, షార్ట్ హెయిర్ స్టైల్ కు సిద్ధంగా ఉండాలి.
- నటనపై ఆసక్తితో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి.
We are on the search for male actors aged 13 to 17 to join the SPIRIT project. If you’ve got the passion and the drive, we want to hear from you. This is your chance to show your skills and be a part of Prabhas-SRV’s Spirit. #YoungTalent#CastingCall#Spirit@imvangasandeeppic.twitter.com/pEMG7Jmz6w
— Bhadrakali Pictures (@VangaPictures) August 7, 2025
ఇలా అప్లై చేయండి..
ఆసక్తి గల అభ్యర్థులు ఈ క్రింది వివరాలను పంపించాల్సి ఉంటుంది..
- మూడు ఫోటోలు - ఒకటి హెడ్‌షాట్, రెండు పర్సనల్ షాట్లు.
- రెండు నిమిషాల యాక్టింగ్ వీడియో - ఇందులో మీ నటనా ప్రతిభను చూపించాలి.
- మీ వివరాలతో కూడిన పరిచయ వీడియో - ఇందులో మీ పేరు, వయసు, చదువు, నటన పట్ల ఉన్న ఆసక్తి వివరించాలి.
ఈ సమాచారం అన్నింటినీ [email protected] ఈ ఈమెయిల్‌కి పంపాలి.. మరిన్ని వివరాలకు 7075770364 no ను సంప్రదించండి.
ఇక సినిమా విషయానికి వస్తే ఇందులో హీరోయిన్ ఎవరన్న ప్రెశ్నకు తాజాగా సమాధానం లభించింది. మొదట బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోన్ ఈ చిత్రానికి హీరోయిన్‌గా అనుకున్నప్పటికీ, ఆమె పెట్టిన కొన్ని షరతులను టీమ్ తిరస్కరించిందట. దీంతో దర్శకుడు సందీప్ వంగా నిర్ణయం మార్చుకుని, తన గత చిత్రం "యానిమల్"లో నటించిన త్రిప్తి డిమ్రీను హీరోయిన్‌గా ఫైనల్ చేశారు.
ఈ విషయాన్ని స్వయంగా సందీప్ రెడ్డి వంగా తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తెలిపారు. త్రిప్తి డిమ్రీ పేరు తెలుగుతో పాటు, ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రాస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టారు సందీప్. దీనితో ఈ సినిమా 9 భాషల్లో రిలీజ్ కానుందన్న స్పష్టత వచ్చింది.
The female lead for my film is now official :-) pic.twitter.com/U7JJQqSUVa
— Sandeep Reddy Vanga (@imvangasandeep) May 24, 2025
Also Read: 'స్పిరిట్' మొదలయ్యేది అప్పుడే..! సాలిడ్ అప్డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్
ప్రభాస్‌కి త్రిప్తి డిమ్రీ జోడిగా కనిపించబోతున్న ఈ కాంబినేషన్, స్క్రీన్ మీద ఎలా కనపడుతుందో చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు, మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ చేస్తునందున ఈ సినిమా గ్లోబల్ రేంజ్‌కి వెళ్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
"స్పిరిట్" అనే టైటిల్ చాలా సింపుల్‌గా అనిపించినా, దీని వెనక చాలా డీప్ కాన్సెప్ట్ ఉంటుందని వంగా చాలా సందర్భాలలో తెలిపారు.
ప్రస్తుతం భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా ప్రభాస్ మరోసారి తన స్థాయిని పెంచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే యానిమల్‌తో దూసుకుపోతున్న సందీప్ వంగా, స్పిరిట్‌తో మరింత యాక్షన్, వయోలెన్స్ డోస్ పెంచనున్నాడు. ఈ తాజా అప్‌డేట్‌తో డార్లింగ్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
అయితే, ఇప్పుడు కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేయడంతో చాలా మందికి తమ కలను నిజం చేసుకునే అవకాశం లభించింది. ఇది పూర్తిగా డిజిటల్ ఆడిషన్ ప్రక్రియ. ఇప్పటికే కొన్ని కీలక పాత్రలకు నటులను ఎంపిక చేసిన చిత్రబృందం, ఇది చివరి అవకాశంగా ప్రకటిస్తోంది. మీరు నటనపై ఆసక్తి కలిగి ఉంటే, ప్రభాస్ వంటి స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే కల ఉంటే ఈ బంపర్ ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు. వెంటనే మీ వీడియోలు పంపించి "స్పిరిట్" సినిమాలో భాగమవ్వండి..!