/rtv/media/media_files/2025/02/17/aL7HVprkaxWP3f1YKytt.jpg)
Kim San Ron Photograph: (Kim San Ron)
హాల్యూవుడ్‌లో విషాదం. దక్షిణ కొరియా సినీ పరిశ్రమలో వరుసగా నటులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. హీరోయిన్ కిమ్ సేన్ రాన్ ఆదివారం మృతి చెందింది. దక్షిణ కోరియాకు చెందిన ఈమె పలు సినిమాలు, డ్రామాల్లో హీరోయిన్‌గా నటించింది. సోమవారం ఉదయం సియోల్ నగరంలోని సాంగ్డాంగ్‌గులోని తన ఇంట్లో ఆమె మృతదేహం చూసిన వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి డెడ్‌బాడీని స్వాధీనం చేసుకొని పోర్టుమార్టంకు పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్లడ్ హాండ్స్, లివరేజ్, మిర్రర్ ఆఫ్ ది విచ్, టు బి కంటిన్యూడ్, స్కూల్ అల్ ఆన్ వంటి డ్రామాల్లో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది కిమ్ సేన్ రాన్.
Also Read: Canada: అవసరమైతే ఉక్రెయిన్ కి మా బలగాలు పంపుతాం: కెనడా ప్రధాని!