Sonu Sood: భార్య ఆరోగ్యంపై సోనూసుద్ ఎమోషనల్ ట్వీట్! ఇప్పుడెలా ఉందంటే

బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌ భార్య సోనాలి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సోనూసుద్ భార్య ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చారు. భార్య సోనాలి, మరో ఇద్దరు కుటుంబ సభ్యులు కోలుకుంటున్నారని.. వారి కోసం దేవుడిని ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు.

New Update
sonu sood wife
Sonu Sood:  నటుడు సోనూసుద్ భార్య సోనాలి మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆమె నాగ్‌పూర్‌ లోని మ్యాక్స్‌  ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోనూసుద్ భార్య ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చారు. ''రోడ్డు ప్రమాదంలో గాయపడిన భార్య సోనాలి, మరో ఇద్దరు కుటుంబ సభ్యులు కోలుకుంటున్నారని తెలిపారు. అలాగే వారు త్వరగా కోలుకోవాలని  దేవుడిని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. 

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

అసలేం జరిగింది..

అయితే సోనుసూద్ భార్య సోనాలి, ఆమె సోదరి, సోదరి కుమారుడు కలిసి సోమవారం రాత్రి కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. ముంబై – నాగ్‌పూర్‌ సమృద్ధి హైవేపై వీరు వెళ్తున్న కారు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోనాలి, ఆమె సోదరి కొడుకుకు తీవ్రగాయాలవగా.. ఆమె సోదరి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం సోనాలి, ఆమె సోదరి కొడుకు చికిత్స పొందుతున్నారు. 

telugu-news | sonu sood wife | latest-news | bollywood cinema-news

Also Read: Mangalavaaram: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు