Sobhita Dhulipala: పెళ్లి తర్వాత శోభిత ఫస్ట్ మూవీ షూటింగ్.. హీరో ఎవరంటే? ఫొటోలు వైరల్

అక్కినేని కోడలు నటి శోభిత ధూళిపాళ్ల వివాహం తర్వాత తన మొదటి ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షెడ్యూల్ లో పాల్గొంటుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
Sobhita first movie after marrige

Sobhita first movie after marrige

Sobhita Dhulipala:  'గూఢచారి' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి  శోభిత తొలి సినిమాకే తన నటనతో అందరి దృష్టి ఆమెపై పడేలా చేసింది. ఆ తర్వాత 'ది నైట్ మేనేజర్', 'మేడ్ ఇన్ హెవెన్' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఎల్లప్పుడూ వైవిధ్యమైన పాత్రలను పోషించడం పట్ల ఉత్సాహంగా ఉండే శోభిత.. కెరీర్ అతితక్కువ సమయంలోనే హాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. 2023లో విడుదలైన అమెరికన్ ఫిల్మ్  'మంకీ మ్యాన్' లో కాల్ గర్ల్ గా కీలకమైన పాత్ర పోషించింది.

Also Read: Chhaava: ఛత్రపతి మహారాజ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. 'ఛావా' ఇప్పుడు తెలుగు వెర్షన్ లో కూడా   

వివాహం తర్వాత తొలి ప్రాజెక్ట్ 

అయితే గతేడాది నాగచైతన్యతో వివాహం తర్వాత శోభిత తన మొదటి ప్రాజెక్ట్ ప్రారంభించింది. తాజాగా హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలేవీ ఇంకా బయటకి రాలేదు. దీంతో శోభిత తదుపరి చిత్రం ఏమిటనే దాని గురించి రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. పెళ్ళికి ముందు చివరిగా శోభిత  హిందీలో లవ్ 'సితార' అనే సినిమాలో చేసింది. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం యావరేజ్ అనిపించుకుంది. 

Also ReadUttam Mohanty: ప్రముఖ హీరో మృతి.. ముఖ్యమంత్రి ఎమోషనల్ పోస్ట్

శోభిత- నాగచైతన్య వివాహం గతేడాది డిసెంబర్  4న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్థూడియోస్ లో  గ్రాండ్ గా జరిగింది. పూర్తిగా తెలుగు సాంప్రదాయం పద్దతిలో వీరి వివాహం జరిగింది. నటి సమంతతో విడిపోయిన నాలుగేళ్ళ తర్వాత చై శోభితను వివాహం చేసుకున్నారు. ఇక చైతన్య సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే తండేల్ సినిమాతో భారీ హిట్ కొట్టారు. రూ. 100 కోట్లకు పైగా వసూళ్లతో చై కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. 
Also Read: రజినీకాంత్ స్పెషల్ సాంగ్ కోసం పూజ భారీ రెమ్యునరేషన్.. ఏకంగా ఒక సినిమాకు ఛార్జ్ చేసేంత

Advertisment
Advertisment
తాజా కథనాలు