Uttam Mohanty: ప్రముఖ హీరో మృతి.. ముఖ్యమంత్రి ఎమోషనల్ పోస్ట్

ప్రముఖ ఒడియా నటుడు ఉత్తమ్ మొహంతి 66 ఏళ్ళ వయసులో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు తెలియజేశారు. మొహంతి ఒడియా, హిందీలో 130 కి పైగా చిత్రాలలో నటించారు.

New Update
actor Uttam Mohanty dies

actor Uttam Mohanty dies

 Uttam Mohanty:  ఒడియా సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఒడియా నటుడు ఉత్తమ్ మొహంతి  కన్నుమూశారు.  ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో లివర్ సిర్రోసిస్‌ సమస్యతో  చికిత్స పొందుతున్న ఆయన గురువారం మృతిచెందారు. సినీ దిగ్గజం మొహంతి మరణం పట్ల ఒడియా చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. సామాన్యుల నుంచి సినీ,   రాజకీయ నాయకుల వరకు అంతా ఆయనకు నివాళులు తెలియజేస్తున్నారు. 

ముఖ్యమంత్రి నివాళులు 

ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కూడా  మొహంతి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. "ఒడిశా ప్రముఖ నటుడు సెక్కిలి మొహంతి మరణవార్త విని చాలా భాదపడ్డాను. ఆయన మరణం ఒడియా కళా ప్రపంచానికి ఒక పెద్ద శూన్యాన్ని మిగిల్చింది. ఒడియా చిత్ర పరిశ్రమలో ఆయన వేసిన ముద్ర ప్రేక్షకుల హృదయాల్లో ఆయనను ఎల్లప్పుడూ చిరస్థాయిగా నిలిపివేస్తుంది. మొహంతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని ట్వీట్ చేశారు ఒడిశా సీఎం."  మొహంతి అంత్యక్రియలు  భువనేశ్వర్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది.  ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన పార్థివ దేహాన్ని అక్కడికి  తీసుకురానున్నారు.

30 కి పైగా సినిమాల్లో

నటుడు మొహంతి ఒడిశాలోని మయూర్‌భంజ్‌లోని బరిపడాలో 1958లో జన్మించారు. 'అభిమాన్‌' సినిమాతో ఒడియా చిత్రపరిశ్రమలో తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో ఆకర్షణీయమైన పాత్రలతో ప్రేక్షకులలో తనదైన ముద్రవేశారు.  నాలుగు దశాబ్దాలకు పైగా  సినీ కెరీర్ లో 130 కి పైగా సినిమాల్లో నటించారు. సుమారు 30 బెంగాలీ చిత్రాల్లో కూడా నటించారు.  'నయా జహెర్‌' అనే చిత్రంలో కూడా నటించారు. 2012లో ఒడిశా లివింగ్ లెజెండ్ అవార్డును అందుకున్నార. అంతేకాదు ప్రతిష్టాత్మక జయదేవ్ పురస్కార్‌తో సత్కరించబడ్డారు. ఒడిశా చిత్రపరిశ్రమకు ఆయన చేసిన కృషికి గానూ పలు సార్లు ఒడిశా స్టేట్ ఫిల్మ్ అవార్డును గెలుచుకున్నారు. 

Also Read: రజినీకాంత్ స్పెషల్ సాంగ్ కోసం పూజ భారీ రెమ్యునరేషన్.. ఏకంగా ఒక సినిమాకు ఛార్జ్ చేసేంత

Advertisment
Advertisment
తాజా కథనాలు