/rtv/media/media_files/2025/04/16/l2d2X8SeCoVT859Cf1KA.jpg)
Sivakarthikeyan- Madharasi
Sivakarthikeyan- Madharasi: శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ‘మదరాసి’ విడుదలకు సిద్ధమవుతోంది. టాప్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను శ్రీ లక్ష్మీ మూవీస్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో శివ కార్తికేయన్ ఇంటెన్స్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్
ఈ సినిమా గురించి చిత్ర బృందం మాట్లాడుతూ, ‘‘ఇది ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్. మురుగదాస్ మార్క్‌కి తగ్గట్లు థ్రిల్ కలిగించే కథాంశంతో సినిమా వస్తోంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతుంది’’ అన్నారు.
Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..
ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా కనిపించనుండగా, విద్యుత్ జమాల్, బిజు మీనన్, షబ్బీర్, విక్రాంత్‌లు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తుండగా, సినిమాటోగ్రఫీకి సుదీప్ ఎలామోన్ బాధ్యతలు చేపట్టారు.
Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని
సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి!
Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..