Madharaasi OTT: శివకార్తికేయన్ రీసెంట్ హిట్ ‘మదరాసి’ ఓటీటీ ఫిక్స్ ..! స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

శివకార్తికేయన్, మురుగదాస్ కాంబోలో వచ్చిన 'మదరాసి' సినిమా నవంబర్ 5న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. థియేటర్ రన్ పూర్తి చేసుకొని ఈ సినిమా అక్టోబర్ 3న అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది.

New Update
Madharaasi OTT

Madharaasi OTT

Madharaasi OTT: శివకార్తికేయన్(Sivakarthikeyan) హీరోగా మురుగదాస్(A. R. Murugadoss) దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'మదరాసి' ఇటీవలే నవంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ భారీ  అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రుక్మిణి వసంత్ కథానాయికగా నటించిన ఈ చిత్రంపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

Also Read: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?

దర్బార్, సికిందర్ లాంటి సినిమాలు తర్వాత మురుగదాస్ మసాలా యాక్షన్‑థ్రిల్లర్‌తో వచ్చారు. అయితే “మదరాసి” కి వచ్చే రివ్యూస్ మాత్రం మిక్స్డ్ గా వచ్చాయి. యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్, కథ, ఇవన్నీ కొంతమందిని ఆకట్టుకోలేకపోయాయి.

Also Read: రామ్ చరణ్ “పెద్ధి” ఇంట్రెస్టింగ్ అప్డేట్: అమ్మగా ‘అఖండ’ నటి!

తమిళనాడులో ఈ చిత్రం కమర్షియల్ గా కొత్త వరకు రాణించినప్పటికీ,  ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్ల పరంగా మూవీ తేలిపోయింది. దాదాపు రూ. 91 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది.

ఇక తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. థియేటర్ రన్ ముగించుకొని త్వరలో అక్టోబర్ 3 నుండి ఈ సినిమా ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది అని సమాచారం.

Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!

తమిళ్, తెలుగు సహా పాన్‑ఇండియా భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. శివకార్తికేయన్ - మురుగదాస్ కాంబో లో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో మిస్ అయినవారికి ఇప్పుడు ఓటీటీలో చూసే అవకాశం దక్కింది.

Advertisment
తాజా కథనాలు