singer Kalpana: మా అమ్మకు.. కల్పన కూతురు చెప్పిన షాకింగ్ నిజాలు.!

సింగర్ కల్పన కేసులో పోలీసులు ఆమె కూతురి స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. "ఫ్యామిలీలో ఎలాంటి ఇష్యూస్ లేవు. కొంతకాలంగా అమ్మ ఇన్సోమ్నియాతో బాధపడుతూ టాబ్లెట్స్ వాడుతున్నారు. ట్యాబ్లేట్స్ ఓవర్డోస్ కావడంతో అలా జరిగింది. అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదని తెలిపింది."

New Update

Singer Kalpana: ప్రముఖ సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కల్పన స్టేట్మెంట్ రికార్డ్ చేయగా.. తాజాగా ఆమె కూతురి స్టేట్మెంట్ ను కూడా తీసుకున్నారు.  "అమ్మ ఇన్సోమ్నియాతో బాధపడుతుంది. దానికోసం కొంతకాలంగా  టాబ్లెట్స్ వాడుతున్నారు. టాబ్లెట్స్  ఓవర్డోస్ కావడంతో అలా జరిగింది. మా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు, అది జనరల్ లైఫ్‌ స్ట్రెస్ మాత్రమే. అలాగే ఫ్యామిలీలో కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు అని తెలిపారు. 

Also Read:Santhana Prapthirasthu: భార్య‌ ప్రెగ్నెన్సీ కోసం హీరో తిప్పలు.. 'సంతాన ప్రాప్తిర‌స్తు' టీజర్ చూశారా?

కల్పన స్టేట్మెంట్.. 

ఇది ఇలా ఉంటే.. మరోవైపు కల్పన తన స్టేట్మెంట్ లో నిద్రమాత్రలు మింగి చనిపోవాలనుకున్నట్లు తెలిపారు. అయితే కేరళలో ఉంటున్న పెద్ద కూతురిని చదువుకోవడానికి  హైదరాబాద్ రావాలని కోరారట. కానీ కూతురు అక్కడే ఉంటానని చెప్పడంతో ఆవేదన చెందిన కల్పన నిద్ర మాత్రలు మింగి చనిపోవాలనుకున్నట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి కల్పన భర్త ప్రసాద్ ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే కల్పన అలాగే అతడి మొబైల్ ను హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. రెండు రోజులుగా కల్పన బయటకు రాకపోవడంతో.. ఇంటి పక్కన వారు విషయం చెప్పడానికి భర్త ప్రసాద్ కి కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదట. దీంతో అతడి పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

కల్పన టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది పాపులర్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.   ఇళయారాజా, ఎస్పీ బాలు, కేవీ మహదేవన్, ఏఆర్ రెహమాన్  చిత్ర వంటి ప్రముఖ సింగర్స్ తో కలిసి అనేక సూపర్ హిట్స్ పాడారు.  ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ ఫుల్ కెరీర్ చూసిన కల్పన.. ఇప్పుడు ఇలా సూసైడ్ అటెంప్ట్ చేయడం అభిమానులను ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. 

Also Read:Kiran Abbavaraam: 'దిల్రుబా' స్టోరీ చెప్పు.. అదిరిపోయే బైక్ పట్టు.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్!

Advertisment
తాజా కథనాలు