Badass: ఇంత డార్క్ సినిమా మీరెప్పుడూ చూసుండరు.. 'బ్యాడాస్' సినిమాపై సిద్ధు కామెంట్స్ వైరల్!

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న 'బ్యాడాస్' టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత డార్క్ సినిమా అవుతుందని ఆయన చెప్పారు. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా సిద్ధును పూర్తిగా రాడికల్ క్యారెక్టర్‌లో చూపించనుంది.

New Update
Badass

Badass

Badass: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda), ‘డీజే టిల్లు’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న తర్వాత యూత్ లో ఫెవరెట్ హీరోగా మారిపోయాడు. ఇతని ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘జాక్’ సినిమాతో ప్లాప్ వచ్చినప్పటికీ, ఇప్పుడు ‘తెలుసు కదా’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్‌తో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

అయితే, తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సిద్ధు చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ, తన తదుపరి సినిమా ‘‘Badass’’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

Also Read: 'రాజా సాబ్' లేట్ కి బన్నీ సినిమానే కారణం? అసలేం జరిగిందంటే..

‘‘బ్యాడాస్ - ఇది టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత డార్క్ సినిమా’’

సిద్ధు మాట్లాడుతూ, ‘‘నేను సాఫ్ట్ పర్సన్ గా నటించడాన్ని వదిలేశాను. నాకు ఇప్పుడు డిఫరెంట్, బోల్డ్ పాత్రలే ఆకర్షణగా అనిపిస్తున్నాయి. ‘Badass’ సినిమా నా ఇప్పటి వరకు చేసిన పాత్రలకన్నా చాలా రాడికల్‌గా ఉంటుంది. ఇది నాకు, ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభవం’’ అన్నారు. అంతేకాదు, ‘‘బహిరంగంగా చెప్పగలను, ‘Badass’ టాలీవుడ్‌లో ఇప్పటి వరకు తీసిన పెద్ద డార్క్ సినిమా అవుతుంది’’ అని మొహమాటం లేకుండా చెప్పాడు.

Also Read: మాధురికి దువ్వాడ ఎలా పరిచయం.. అక్కడే ఇద్దరి మధ్య లేటు వయసులో ఘాటు ప్రేమ!

‘‘రాడికల్ అని అంటే కొంతమంది యగ్గ్రసివ్ గా మాట్లాడడం, మస్క్యులినిటీ చూపించడం అనుకుంటారు. కానీ నిజంగా రాడికల్‌గా ఉండటం అంటే మన జీవితంలో ఎదురయ్యే గట్టి అనుభవాలను, భావోద్వేగాలను సినిమాల రూపంలో బయటపెట్టడమే’’ అని సిద్ధు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. "సినిమా ఒక ఆర్ట్, అది మన జీవితంలో ఎదురైన సంగతులను చూపించే ఒక మార్గం" అని తెలిపాడు.

Also Read: ఓటీటీలో దూసుకెళ్తున్న 'లిటిల్ హార్ట్స్' ఏకంగా అన్ని మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్..!

'బ్యాడాస్' సినిమాను ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ ఫేమ్ రవికాంత్ పెరెపు దర్శకత్వం వహిస్తున్నారు. ఇది సిద్ధుతో ఆయన రెండవ సినిమా. ఈ ఏడాది జులైలో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సిద్ధు రగ్డ్, బోల్డ్ లుక్‌లో కనిపించాడు. టైటిల్ కింద ఉన్న “If middle finger was a man” అనే ట్యాగ్‌  లైన్ చూస్తేనే సినిమా క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అర్థం అవుతుంది.

Also Read: ఇద్దరు హీరోయిన్లతో సిద్దూ ఫుల్ రొమాన్స్.. పిచ్చెక్కిస్తున్న 'తెలుసు కదా' ట్రైలర్!

సిద్ధు చేసిన ఈ కామెంట్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. డిఫరెంట్ కంటెంట్ కోరుకునే ప్రేక్షకులకు ‘‘బ్యాడాస్’’ మరో వైవిధ్యమైన అనుభూతిని ఇవ్వనుంది. విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు కానీ, సిద్ధు ఫ్యాన్స్ మాత్రం ఫుల్ గా ఎదురు చూస్తున్నారు!

Advertisment
తాజా కథనాలు