Siddu Jonnalagadda: 'BADASS'తో సిద్ధు కొత్త అవతార్.. ఈసారి టిల్లుకి మించి!

సిద్దు జొన్నలగడ్డ తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. 'బడాస్‌' (BADASS) అనే పేరుతో ఈ సినిమాను ప్రకటించారు. ఈ మేరకు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

New Update
siddu jonnalagadda new project

siddu jonnalagadda new project

Siddu Jonnalagadda:  'డీజే టిల్లు' సినిమాతో స్టార్ బాయ్ మారిన సిద్దూ జొన్నలగడ్డ వరుస ప్రాజెక్టులు చేస్తూ కెరీర్ లో బిజీగా ముందుకెళ్తున్నాడు. ఈ మధ్యే వచ్చిన 'జాక్' సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో, సిద్ధు తన మార్కెట్‌ను తిరిగి నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ క్రమంలో సిద్దు తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. 'బడాస్‌' (BADASS) అనే పేరుతో ఈ సినిమాను ప్రకటించారు. ఈ మేరకు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

Also Read: బుద్ధిలేని బంగ్లాదేశ్.. టర్కీతో కలిసి భారత్ పై కుట్ర.. అదే జరిగితే ఇండియాకు ఇబ్బందేనా?

ఫస్ట్ లుక్ పోస్టర్

పోస్టర్‌లో సిద్ధు కళ్ళద్దాలు పెట్టుకుని, సిగరెట్ వెలిగిస్తూ రఫ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ''మీరు హీరోలను, విలన్లను చూసి ఉంటారు. కానీ ఇతను మీ లేబుల్స్‌కు సరిపోడు'' అనే క్యాప్షన్ తో పోస్టర్ షేర్ చేశారు. అలాగే  "If middle finger was a man" (మధ్యవేలు మనిషి అయితే) అనే ట్యాగ్‌లైన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

Also Read: యుగాంతం ఎఫెక్ట్‌.. భారత్‌లో ఒకేరోజు మూడు భూకంపాలు

రవికాంత్ పేరేపు కథ

'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' వంటి బ్లాక్‌బస్టర్‌లను అందించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అలాగే  'కృష్ణ అండ్ హిజ్ లీల'తో సిద్ధుకు హిట్ ఇచ్చిన రవికాంత్ పేరేపు దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమా కథను సిద్దూ, రవికాంత్ పేరెపు కలిసి రాశారు. 

Also Read: నితీశ్‌ కుమార్ సంచలన నిర్ణయం.. మహిళలకు 35 శాతం రిజర్వేషన్‌

'BADASS' ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ఇందులో సిద్దూ  మునుపెన్నడూ చూడని కొత్త అవతార్‌లో కనిపించబోతున్నట్లు చిత్రబృందం చెబుతోంది. 'జాక్' సినిమా డిజాస్టర్ తర్వాత సిద్ధు ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. దీంతో  తన మార్కెట్‌ను మళ్లీ పెంచుకుని, తన నటనా ప్రతిభను మరోసారి నిరూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.  యంగ్ మ్యూజిక్ డైరెక్టర్  అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 

Also Read: Samantha - Raj Nidimoru Dating: మళ్ళీ తెరపైకి డేటింగ్ రూమర్లు.. వెకేషన్ లో రాజ్- సమంత! ఫొటోలు వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు