Siddhu Jonnalagadda OG: స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డకు తాకిన 'OG' ఫీవర్.. హైప్ కి పోయేలా ఉన్నా అంటూ పోస్ట్

OG సినిమా పట్ల అభిమానుల్లోనే కాదు, సెలబ్రిటీల్లో కూడా హైప్ పెరుగుతోంది. సిద్ధూ జొన్నలగడ్డ OG కోసం తాను 25 వరకు వెయిట్ చేయలేకపోతున్నా అంటూ పోస్ట్ పెట్టారు. పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.

New Update
Siddhu Jonnalagadda OG

Siddhu Jonnalagadda OG

Siddhu Jonnalagadda OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ థ్రిల్లర్ OG (They Call Him OG) పై ప్రేక్షకుల్లోనే కాదు, సెలబ్రిటీల్లో కూడా ఆసక్తి తారాస్థాయికి చేరుకుంది. అభిమానులంతా OG కోసం ఎదురు చూస్తుండగా, ఇప్పుడు డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ కూడా ఈ ఫీవర్‌లో జాయిన్ అయ్యాడు.

Also Read: 'OG' సునామీ షురూ.. బుకింగ్స్ ఓపెన్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?

“యే పవన్ నహీ... ఆంధీ హై”

తాజాగా తన సోషల్ మీడియా (X) ద్వారా స్పందించిన సిద్ధూ, OG కోసం తానూ వెయిట్ చేస్తున్నా అని తెలిపారు. ఆయన పోస్ట్‌లో,
“#OG HYPE కి health upset అయ్యేలా ఉంది. 25వ తేదీ వరకూ ఉన్నామో లేదో తెలీదు. ఇప్పుడే ఇలా ఉంటే సెప్టెంబర్ 25 తర్వాత పరిస్థితి ఏంటో!” అంటూ రాశారు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి “యే పవన్ నహీ... ఆంధీ హై” అంటూ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. దర్శకుడు సుజీత్ గురించి కూడా, “ఇది అన్‌రియల్ బ్రో!” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

Also Read: 'కల్కి 2' నుండి దీపికను తీసేసారు సరే.. మరి బిడ్డను కనేదెవరు..?

ఇక OG సినిమా విషయానికొస్తే, ఇది పూర్తిగా స్టైల్, మాస్ యాక్షన్ మిక్స్‌తో కూడిన గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు, పోస్టర్లు-మాస్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ లుక్, ఆయన డైలాగ్ డెలివరీ, పవర్‌పుల్ బాడీ లాంగ్వేజ్ అన్నీ ఫ్యాన్స్‌కి పండగలా మారాయి.

Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద మాఫియా.. అల్లు అరవింద్‌ క్రెడిట్స్ కొట్టేస్తాడు: బండ్ల గణేష్

ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తొలిసారి తెలుగు తెరకు విలన్‌గా పరిచయం కానున్నారు. అలాగే హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా, సంగీత దర్శకుడిగా తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు పొందింది. ముఖ్యంగా టీజర్‌లో వినిపించిన BGM సినిమాపై అంచనాలను పెంచేసింది.

డీవీవీ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాకు సంబంధించి బుకింగ్స్ ఇప్పటికే కొన్ని థియేటర్లలో ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 25న సినిమా గ్రాండ్‌గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుండడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.

Advertisment
తాజా కథనాలు