/rtv/media/media_files/2025/10/15/telusu-kada-promotions-2025-10-15-11-05-09.jpg)
Telusu Kada Promotions
Telusu Kada Promotions: యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’, దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల కాబోతుంది. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను నీరజ కోన అనే కొత్త దర్శకురాలు తెరకెక్కించింది. ప్రేమ, రిలేషన్‌షిప్‌ల నేపథ్యంలో రూపొంది ఒక ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా చిత్రబృందం పరిచయం చేసిన ఈ సినిమా ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.
Also Read:రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'పౌర్ణమి' 4K రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!
ట్రైలర్‌తో షాక్.. (Telusu Kada Trailer)
టీజర్‌లతో సరదాగా సాగిన ప్రమోషన్స్ ట్రైలర్ తో మాత్రం టోటల్ ట్విస్ట్ ఇచ్చారు. సిద్ధు ఇద్దరు హీరోయిన్స్‌ను ఒకేసారి ప్రేమిస్తున్నట్టు చూపించడంతో ప్రేక్షకుల్లో కొత్త ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ సీన్స్ వల్ల సిద్ధు పాత్ర ఎలా ఉంటుందో, కథ ఏం చెప్పబోతుందో అనే ఆసక్తి పెరిగింది. అయితే, అసలు కాన్సెప్ట్‌ను మేకర్స్ ఇంకా బయటపెట్టకపోవడం అయోమయంగా మారింది.
Also Read: ఎవరి వల్ల కానిది 'బాహుబలి: ది ఎపిక్' రీరిలీజ్ తో జరుగుతోంది.. ఏంటో తెలిస్తే..!
ఈరోజుల్లో ప్రేక్షకులు సినిమా థియేటర్లకు వస్తున్నప్పుడు ఒక స్పష్టమైన అభిప్రాయంతో వస్తున్నారు. అప్పుడు కథ వారి అంచనాలను తలకిందుల చేస్తే, వెంటనే నిరాశకు గురవుతారు. అదే ‘తెలుసు కదా’ విషయంలో జరిగితే, రిస్క్ ఎక్కువే. కథలోని అసలు మెస్సేజ్ ట్రైలర్‌లో చూపించకపోవడం కొన్ని వర్గాల్లో విమర్శలకు దారితీస్తోంది.
Also Read: 'రాజా సాబ్' లేట్ కి బన్నీ సినిమానే కారణం? అసలేం జరిగిందంటే..
ఇండస్ట్రీలో మిక్స్‌డ్ ఓపీనియన్
కొంతమంది ఇండస్ట్రీవాళ్లు, సినిమా అసలు థీమ్‌ను ముందే బహిర్గతం చేయాలని మేకర్స్ కి చెబుతున్నారు. కానీ డైరెక్టర్ నీరజ కోన టీమ్ మాత్రం కథపై నమ్మకంతో ఉన్నారు. ప్రేక్షకులకు థియేటర్లలో ఒక కొత్త అనుభవాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఎప్పుడూ ముందుగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని, సర్‌ప్రైజ్ అనే ఫ్యాక్టర్‌తోనే కనెక్ట్ అవుతారని నమ్మకంగా ఉన్నారు. మొత్తానికి, ‘తెలుసు కదా’ ఒక ట్రెడిషనల్ లవ్ స్టోరీలా కనిపించినా, ఇందులో ఉన్న డీప్ థాట్స్, రియలిస్టిక్ ఎమోషన్స్, మోడరన్ రిలేషన్‌షిప్స్‌పై డిస్కషన్ ప్రేక్షకులను ఆశ్చర్యపరచేలా ఉన్నాయి. అయితే ఈ సీక్రెట్ ప్రోమోషన్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో దీపావళి రోజే తెలుస్తుంది!
Also Read: ఒకేసారి ఇద్దరు హీరోయిన్స్‌తో సిద్ధు.. ‘తెలుసు కదా’ ట్రైలర్ షాక్ ఇచ్చిందా..?