అడివి శేష్ సినిమా నుంచి తప్పుకున్న శృతిహాసన్.. కారణం అదే

అడివి శేష్ 'డకాయిట్' మూవీ నుంచి శృతిహాసన్‌ తప్పుకుందనే వార్త తెరపైకి వచ్చింది. తన పాత్రకు సంబంధించి, ప్రొడక్షన్‌ హౌస్‌తో నెలకొన్న సమస్యల కారణంగా నేపథ్యంలో శృతిహాసన్‌ సినిమా నుంచి తప్పుకుందట. ఈ నేపథ్యంలో మరో పాపులర్ హీరోయిన్‌నుఆమె ప్లేస్‌లో తీసుకున్నారట.

advi sesh
New Update

టాలీవుడ్ టాలెంటడ్ యాక్టర్ అడివి శేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ హీరో 'గూఢచారి' సీక్వెల్ తో పాటూ 'డెకాయిట్' అనే మూవీ చేస్తున్నాడు.  ఈ చిత్రంలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ టైటిల్ టీజర్ చేయగా.. అది సినిమాపై ఆసక్తి పెంచింది. 

Also Read : 12 ఏళ్ళ తర్వాత తల్లి కాబోతున్న బాలయ్య హీరోయిన్.. బేబీబంప్ ఫొటోలు వైరల్

శృతిహాసన్ అవుట్..

సినిమాలో అడివి శేష్, శృతిహాసన్ మాజీ ప్రేమికులుగా కనిపించనున్నారు.  ఈ చిత్రానికి షనీల్‌ డియో కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే అనూహ్యంగా ఈ సినిమా నుంచి శృతిహాసన్‌ తప్పుకుందని వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. తన పాత్రకు సంబంధించి, ప్రొడక్షన్‌ హౌస్‌తో నెలకొన్న సమస్యల కారణంగా నేపథ్యంలో శృతిహాసన్‌ సినిమా నుంచి తప్పుకుందట. 

Also Read : 'గుంటూరు కారం' టైటిలే తప్పు.. అసలు మేం అనుకున్న సినిమానే వేరు : నాగవంశీ

ఈ నేపథ్యంలో శృతిహాసన్‌ ప్లేస్‌లో మరో పాపులర్ హీరోయిన్‌ను తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఆ హీరోయిన్ పేరును మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నట్లు  ఇన్‌సైడ్‌ టాక్‌ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా.. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

Also Read : దేవిశ్రీ ప్రసాద్ ను వివాదంలోకి లాగిన సీఎం రేవంత్.. షాక్ లో ఫ్యాన్స్!

అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను ప్రజెంట్ చేస్తోంది. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి అడివి శేష్, షానీల్ డియో కథ, స్క్రీన్‌ప్లే కూడా అందించారు. ‘మేజర్’ తర్వాత శేష్ నటిసున్న సెకెండ్ స్ట్రయిట్ హిందీ మూవీ ఇదే కావడం విశేషం. 

Also Read : పవర్ స్టార్ టైటిల్ తో యాంకర్ ప్రదీప్ సినిమా.. ఆకట్టుకునేలా మోషన్ పోస్టర్

#actress-shruti-haasan #adivi-sesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe