/rtv/media/media_files/2025/10/14/shraddha-kapoor-2025-10-14-13-22-25.jpg)
Shraddha Kapoor
Shraddha Kapoor: బాలీవుడ్ అందాల తార శ్రద్ధా కపూర్ ఇటీవల 'స్ట్రీ 2' అనే భారీ హిట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వరుస విజయాలతో ఆమె కొత్త ప్రాజెక్టుల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. తాజాగా ఓ ప్రత్యేకమైన ఫాంటసీ మూవీకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
Also Read: 'రాజా సాబ్' లేట్ కి బన్నీ సినిమానే కారణం? అసలేం జరిగిందంటే..
Also Read: ఇద్దరు హీరోయిన్లతో సిద్దూ ఫుల్ రొమాన్స్.. పిచ్చెక్కిస్తున్న 'తెలుసు కదా' ట్రైలర్!
డార్క్ ఫాంటసీ కథ..
ఈ సినిమాకు రాహీ అనిల్ బర్వే(Tumbbad Director) దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన తెరకెక్కించిన 'తుంబాద్' సినిమాను చూసినవారు, ఆయన టేకింగ్, మిస్టిక్ టచ్‌కి ఫిదా అవుతారు. ‘తుంబాద్’ను భారతదేశంలోని బెస్ట్ హారర్ ఫాంటసీ చిత్రాల్లో ఒకటిగా భావిస్తారు. అదే రాహీ ఇప్పుడు తెరకెక్కించనున్న ‘పహాడ్‌పంగిరా’ కూడా మానవత్వం, పురాణాలు, పాత నమ్మకాలతో కూడిన డార్క్ ఫాంటసీ కథ అని తెలుస్తోంది.
Also Read: ఓటీటీలో దూసుకెళ్తున్న 'లిటిల్ హార్ట్స్' ఏకంగా అన్ని మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్..!
ఈ కథ నేపథ్యంలో సతీ సాంప్రదాయం, మహిళా స్వేచ్ఛ లాంటి నూతన కోణాలు కలగలిపి ఉంటాయని సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించనున్నారు. శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో కథానాయికగానే కాదు, క్రియేటివ్ నిర్మాత (Creative Producer)గా కూడా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది. కథలో ఉన్న ఒరిజినాలిటీ చూసి శ్రద్ధా ఈ సినిమాను ఒక ఫ్రాంచైజ్‌గా అభివృద్ధి చేయవచ్చని భావిస్తున్నారట.
Also Read: మాధురికి దువ్వాడ ఎలా పరిచయం.. అక్కడే ఇద్దరి మధ్య లేటు వయసులో ఘాటు ప్రేమ!
ఇదే కథను మొదట్లో 'తుంబాద్' యూనివర్స్‌లో భాగంగా ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే, దర్శకుడు రాహీ అనిల్ బర్వే, నిర్మాత సోహమ్ షా మధ్య వచ్చిన క్రియేటివ్ భేదాభిప్రాయాల కారణంగా తుంబాద్ యూనివర్స్ ఆలోచన నుంచి వైదొలిగినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే కథ పూర్తయినట్టుగా, ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ‘పహాడ్‌పంగిరా’ మూవీ రూపంలో శ్రద్ధా కపూర్ కెరీర్‌లో మరో సూపర్ హిట్ వచ్చే అవకాశం ఉంది.
Follow Us