SHARWA 38 ఇటీవలే 'మనమే' సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న శర్వానంద్.. ప్రస్తుతం 'నారీనారీ నడుమ మురారి', 'శర్వా38' ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. 'నారీనారీ నడుమ మురారి' ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతుండగా.. 'శర్వా38' ప్రీ ప్రొడక్షన్ కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈమూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
డింపుల్ హయతి ఆన్ బోర్డు
ఇప్పటికే 'శర్వా38' లో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నట్లు అనౌన్స్ చేయగా.. ఇప్పుడు మరో ఫీమేల్ లీడ్ ని పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. యంగ్ బ్యూటీ డింపుల్ హయతీ ఇందులో మరో కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. అంచనాలు మించే పాత్ర కోసం 'శర్వా38' బృందం #డింపుల్ హయతీని వెల్కమ్ చేస్తోంది అంటూ పోస్ట్ పెట్టారు. ఈ పోస్టర్ హయతి పెద్ద చెవిపోగులు, చేతికి ఉంగరం, పెదాల కింద పుట్టుమచ్చతో కనిపించింది. త్వరలో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
Our #Sharwa38 world just got brighter!
— Sampath Nandi (@IamSampathNandi) April 28, 2025
Welcoming @DimpleHayathi..
The Chandh of our Soil..
Shoot begins soon..
A #SharwaSampathBloodFest 🔥
Charming star @ImSharwanand @anupamahere @KKRadhamohan @KirankumarMann4 @SriSathyaSaiArt pic.twitter.com/sS6sCjhR2u
పీరియాడికల్ యాక్షన్ డ్రామా
ఓదెల ఫేమ్ సంపత్ నంది దర్శకత్వంలో 1960 లో జరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా 'శర్వా38' ఉండబోతుంది. ఇందులో శర్వా ఓ భిన్నమైన అవతారంలో కనిపించబోతున్నారు. శర్వా కెరీర్ లో ఈ పాత్ర మరో మైలురాయి కాబోతుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు డైరెక్టర్ సంపత్ నంది. శర్వా తొలిపాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందించనున్నారు.
telugu-news | latest-news | actor-sharwanand | dimple-hayathi
Also Read: Samantha Temple బర్త్ డే రోజున సమంతకు ఏకంగా గుడి కట్టించిన అభిమాని.. నెట్టింట వీడియో వైరల్