Payal Rajput: నన్ను తొక్కేసారు.. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే?- పాయల్

ఇండస్ట్రీలో నెపోటిజంపై హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పరిశ్రమలో గుర్తింపు దక్కడం లేదని, అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేయి జారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. "#struggleisreal" అనే హ్యాష్ ట్యాగ్ తో 'X' లో పోస్ట్ చేసారు.

New Update
Paayal Rajput

Payal Rajput

Payal Rajputతెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నెపోటిజం(Nepotism)పై ఇప్పటివరకు ఎంతో మంది యాక్టర్స్ తమ ఆవేదన వ్యక్తం చేసారు. రీసెంట్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా ఆ జాబితాలో చేరిపోయారు. ఇండస్ట్రీ లో నడుస్తున్న నెపోటిజంపై పాయల్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఎంత కష్టపడినా తన టాలెంట్ కి తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఇండస్ట్రీలో రాణించడం చాలా కష్టమని అభిప్రాయపడింది ఢిల్లీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. 'RX 100' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఫస్ట్ సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ, ఆశించిన విజయం దక్కలేదు.

Also Read: ప్రధాని నుంచి సినీ తారల వరకు అంతా షాకయ్యారు! అసలు 'Adolescence' సీరీస్ లో ఏముంది?

అయితే తాజాగా, "మంగళవారం" సినిమాలో నటించిన పాయల్ తన అద్భుత నటనతో విమర్శకుల ప్రశంసలు పొందింది. 'మంగళవారం' మంచి విజయం సాధించడంతో తన నటనకుగాను జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకుంది. అయితే, మంగళవారం సూపర్ సక్సెస్ తో అమ్మడుకి మంచి అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు, కానీ అలా జరగలేదు. అవకాశాలు రాక నిరాశ చెందిన పాయల్ ఇండస్ట్రీ గురించి తన మనసులోని భావాలను ఒక పోస్ట్‌లో వెల్లడించింది.

Also Read: యూట్యూబర్ రణ్‌వీర్‌ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన

#STRUGGLEISREAL

"struggleisreal" అనే హ్యాష్ ట్యాగ్ ను జోడిస్తూ "తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో  నటిగా గుర్తింపు దక్కడం చాలా కష్టం. ప్రతిరోజు నిరాశతో మొదలవుతుంది. ఎందుకంటే, ఇక్కడ ప్రతిభ ఎవరికీ అవసరంలేదు నెపోటిజం, పక్షపాతంతో నిండిన ఈ ప్రపంచంలోనే నేను రోజూ గడపాలి. నాకు ఎప్పుడూ ఒక సందేహం ఉంటుంది. ఎంతగానో కష్టపడి, అంకితభావంతో పనిచేస్తున్నప్పటికీ, నాకు అవకాశాలు రావు అసలు ఇక్కడ నేను రాణించగలనా లేదా అన్న సందేహం వస్తుంది. అవకాశాలు వచ్చినట్టే వచ్చి నా చెయ్యి జారిపోతున్నాయి. కొందరు తమ ఇంటిపేరు వాడి ఛాన్సులు తెచ్చుకుంటారు, మరికొందరు ఏజెంట్స్ ద్వారా అవకాశాలు పొందుతున్నారు. ఇక్కడ ప్రతిభకు తగ్గ అవకాశాలు రావడం లేదు. ఇక ఈ రంగంలో నేను సక్సెస్ అవ్వలేను" అని పాయల్ తన మనసులోని ఆవేదన చెప్పుకొచ్చింది.

Also Read: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే!

Also Read: ఈ సారి ట్రంప్‌ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు