/rtv/media/media_files/2025/09/19/weekend-ott-2025-09-19-12-36-15.jpg)
Weekend OTT
Weekend OTT: ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాలు సందడి చేస్తుండగా, ఓటీటీ వేదికపై కూడా కొన్ని ఆసక్తికరమైన సినిమాలు స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి. థియేటర్లలో ఇప్పటికే మిరాయ్, కిష్కింద కాండ సినిమాలు సెకండ్ వీక్‌లో కూడా మంచి ఫీడ్‌బ్యాక్‌తో కొనసాగుతుండగా, ఓటీటీలో ఏమేం స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.
Also Read: 'OG' సునామీ షురూ.. బుకింగ్స్ ఓపెన్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?
1. మహావతార్ నరసింహ (Mahavatar Narasimha OTT) - Netflix
కన్నడలో రూపొందిన ఈ యానిమేషన్ మూవీ, లక్ష్మీనరసింహ స్వామి కథ ఆధారంగా తీసిన సినిమా. ఆధ్యాత్మిక థీమ్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్ 20 నుంచి నెట్‌ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చింది. దేవుళ్లపై ఆసక్తి ఉన్నవారికి తప్పక చూడవలసిన చిత్రమిది.
2. Bads of Bollywood - Netflix
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తన కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న వెబ్ సిరీస్ ఇది. బాలీవుడ్ ఇండస్ట్రీ చీకటి కోణాలను సెటైరిక్‌గా చూపించే ఈ సిరీస్‌కపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌లో బాలీవుడ్ స్టార్లను ఎక్కువగా చూపించడం విశేషం.
Also Read: 'కల్కి 2' నుండి దీపికను తీసేసారు సరే.. మరి బిడ్డను కనేదెవరు..?
3. ప్రేమ ఇష్క్ కాదల్ - ETV Win
శ్రీ విష్ణు, శ్రీముఖి, హర్షవర్ధన్ రాణే, రీతూ వర్మ, వితిక నటించిన ఈ రొమాంటిక్ డ్రామా 12 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు ETV Winలో అందుబాటులో ఉంది. మళ్లీ మళ్లీ చూసేలా ఉండే కథతో మంచి మిడ్‌క్లాస్ ఫీల్స్ కలిగించే చిత్రమిది.
Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద మాఫియా.. అల్లు అరవింద్ క్రెడిట్స్ కొట్టేస్తాడు: బండ్ల గణేష్
4. కన్యాకుమారి - Aha & Prime Video
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రం ఇప్పుడే ఆహా, ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. పల్లెటూరి ప్రేమకథను, భావోద్వేగంగా చూపించిన ఈ చిత్రం ఓ ఫీల్‌గుడ్ మూవీగా టాక్ తెచ్చుకుంది.
5. హాలీవుడ్ థ్రిల్లర్స్ - Black Rabbit & Sinners
సెప్టెంబర్ 18 నుంచి రెండు ఇంట్రెస్టింగ్ హాలీవుడ్ క్రైమ్/హారర్ థ్రిల్లర్స్ కూడా ఓటీటీలోకి వచ్చాయి. బ్లాక్ రాబిట్, సిన్నర్స్ అనే ఈ చిత్రాలు మిస్టరీ, సస్పెన్స్ ని ఇష్టపడేవారికి మంచి ఎంగేజింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి.
6. మలయాళ హారర్-థ్రిల్లర్ ఫిలిమ్స్ - From September 19
మలయాళ భాషలో కూడా థ్రిల్లింగ్ కంటెంట్ ఈ వారం ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. శ్వాసిక నటించిన రందాం యామం, ధ్యాన్ శ్రీనివాసన్ నటించిన ఐడీ: ది ఫేక్, అలాగే టూ మెన్ వంటి చిత్రాలు సెప్టెంబర్ 19 నుంచి ఓటీటీలో అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ డార్క్ థీమ్ నచ్చేవాళ్ళు చూసే కంటెంట్.
7. తమిళ్/ఇంగ్లీష్ కంటెంట్
- తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ ఇంద్ర
- Same Day With Someone
- Bellen
- She Said Maybe
- The Trial Season 2
- Billionaire’s Bunker
వంటి సిరీస్‌లు కూడా ఈ వారం నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఈ వారం థియేటర్లు చిన్న సినిమాలతో హౌస్‌ఫుల్ కానుండగా, ఓటీటీ వేదికపై కూడా మంచి కంటెంట్ అందుబాటులో ఉంది. హారర్, మిస్టరీ, లవ్ స్టోరీస్, యానిమేషన్ ఇలా వివిధ జానర్లలో సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమ్ అవుతుండడంతో, వీకెండ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఫోన్, టీవీ స్క్రీన్ లకి అతుక్కుపోవడానికి సరైన సమయం ఇదే.