Virat Kohli తో రాధిక శరత్ కుమార్ సెల్ఫీ.. ఎక్కడ కలిశారంటే?

సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ తన ఇన్ స్టా లో విరాట్ కోహ్లీతో దిగిన సెల్ఫీని అభిమానులతో పంచుకుంది. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ కోసం విరాట్ చెన్నైకి ఫ్లైట్ లో వస్తుండగా అదే ఫ్లైట్ లో రాధిక శరత్ కుమార్ ను కలిశారు. ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది.

author-image
By Anil Kumar
New Update
virat radika

Senior Actress Radikaa Sarathkumar with Virat Kohli :

సౌత్ సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటోను అభిమానులతో పంచుకుంది. అది చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందుకు కారణం ఆ ఫొటోలో మన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉండటమే.

నిజానికి సౌత్ యాక్టర్స్ తో విరాట్ కోహ్లీకి పెద్దగా పరిచయం లేదు. అలాంటిది కోలీవుడ్ నటి రాధిక శరత్ కుమార్ ను విరాట్ ఎక్కడ కలిశాడని నెటిజన్స్ ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. దీంతో ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

Also Read :  అరికెపూడి ఇంటి వద్ద హైటెన్షన్.. కాంగ్రెస్ శ్రేణుల అరెస్ట్!

కాగా రాధిక ఈ సెల్ఫీని షేర్ చేస్తూ..' కొన్ని కోట్ల హృదయాలకు దగ్గరైన వ్యక్తి విరాట్‌ కోహ్లీ. తన ఆటతో మనల్ని గర్వపడేలా చేస్తాడు. కొంత సమయం పాటు అతనితో కలిసి ప్రయాణం చేయడం ఆనందంగా ఉంది. సెల్ఫీ తీసుకున్నందుకు ధన్యవాదాలు' అన్ని రాసుకొచ్చారు.

Also Read :  YS Jagan: పాలిటిక్స్ లో మళ్లీ యాక్టీవ్ అయిన రోజా.. ఆ నేతలు ఔట్!

వీళ్లిద్దరు ఎక్కడ కలిశారంటే..

సెప్టెంబర్ 19న చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్‌ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. దీంతో ఇవాళ వేకువజామున 4 గంటలకు లండన్‌ నుంచి నేరుగా ఆయన చెన్నైకి చేరుకున్నారు. ఈ క్రమంలో అదే విమానంలో రాధిక శరత్‌కుమార్‌ కూడా ప్రయాణం చేశారు. ఆ సమయంలో వారిద్దరూ సరదాగా కొంత సమయం పాటు ముచ్చటించి.. ఆ తర్వాత సెల్ఫీ తీసుకున్నారు.

Also Read :  వామ్మో..ఏపీకి ముంచుకొస్తున్న మరో వానగండం!

Also Read :  Rains : వరుణా మళ్లీ వచ్చావా... బంగాళాఖాతంలో అల్పపీడనం

Advertisment
తాజా కథనాలు