/rtv/media/media_files/2025/02/12/koMyIcnp1n6OHkdZNbHW.jpg)
Sankranthiki Vasthunam ott streming
Sankranthiki Vasthunam: అనిల్ రావిపూడి - వెంకటేష్ కాంబోలో రిలీజైన 'సంక్రాంతికి వస్తున్నాం' బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని సైతం విపరీతంగా ఆకట్టుకుంది. కేవలం రూ. 50 కోట్లతో రూపొందిన ఈ మూవీ రూ.300కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది. వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ప్రాంతీయ భాషల్లో మాత్రమే రిలీజై రూ.300కోట్ల మార్క్ దాటిన తొలి సినిమాగా రికార్డు సృష్టించింది.
Also Read: Lucky Baskhar: ఇదేం క్రేజ్ రా బాబు.. 'లక్కీ భాస్కర్' ఎక్కడ వదలట్లేదు.. నెట్ ఫ్లిక్స్ లో మరో రికార్డు
ఓటీటీ డేట్ ఫిక్స్
అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఫైనల్లీ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మార్చి 6న టీవీతో పాటు ఓటీటీలో కూడా ప్రసారం కానున్నట్లు ప్రకటించారు. జీ తెలుగు ఛానెల్ లో టీవీ ప్రీమియర్ కానుండగా.. జీ5 లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.
OFFICIAL:- #SankranthikiVasthunam Tamil Dubbed Movie Final OTT Release Sets to Premeire On March 1, 6 PM on Zee5
— SRS CA TV (@srs_ca_tv) February 22, 2025
Also In Telugu Hindi Kannada Malayalam pic.twitter.com/reAiqHquap
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేష్ ఫీమేల్ లీడ్స్ గా నటించగా.. సాయి కుమార్, వీటీ గణేష్, శ్రీనివాస్ అవసరాల, ప్రిథ్వీ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇందులో ముఖ్యంగా బుల్లిరాజు సినిమాకే హైలైట్ గా నిలిచింది.
Also Read: Samantha: ఒంటరితనం భయంకరంగా ఉందట.. రెండో పెళ్లిపై హింట్ ఇచ్చిన సమంత
Also Read: Chhaava: ఛత్రపతి మహారాజ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. 'ఛావా' ఇప్పుడు తెలుగు వెర్షన్ లో కూడా