/rtv/media/media_files/2025/10/15/sankranthiki-vasthunam-2025-10-15-12-25-27.jpg)
Sankranthiki Vasthunam
Sankranthiki Vasthunam: గత కొన్ని రోజులుగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar), వెంకటేష్ నటించిన హిట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ లో నటించబోతున్నాడని వార్తలు వైరల్ అయ్యాయి. ఈ రీమేక్‌ను ప్రముఖ దర్శకుడు అనీస్ బాజ్మీ తెరకెక్కించబోతున్నాడని, నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తాడని ఊహాగానాలు సాగాయి.
రీమేక్ చేసే ఆలోచన లేదు..
కానీ తాజాగా పింక్‌విల్లా వెబ్‌సైట్‌లో వెలువడిన ఓ రిపోర్ట్ ప్రకారం, అక్షయ్ కుమార్ ఈ రీమేక్‌లో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. అక్షయ్ నిజానికి ఈ సినిమాను తాను వ్యక్తిగతంగా ప్రేక్షకుడిగా మాత్రమే చూశాడని, అది తనకు నచ్చినా కూడా దాన్ని రీమేక్ చేసే ఆలోచన లేదని ఆ రిపోర్ట్ చెబుతోంది.
Also Read: ఎవరి వల్ల కానిది 'బాహుబలి: ది ఎపిక్' రీరిలీజ్ తో జరుగుతోంది.. ఏంటో తెలిస్తే..!
అలాగే అక్షయ్ కుమార్, అనీస్ బాజ్మీ ఇటీవల పదే పదే కలుస్తుండటం వేరే ఓ కొత్త ప్రాజెక్ట్ కోసమేనని సమాచారం. అయితే, ఆ ప్రాజెక్ట్ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ నిజంగా ఉంటుందా లేదా? అన్నది ఇంకా అనుమానంగా మారింది.
Also Read:రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'పౌర్ణమి' 4K రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!
ఇదిలా ఉంటే, ప్రస్తుతం అక్షయ్ కుమార్ తన చేతిలో ఉన్న పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆయన ప్రధానంగా నటిస్తున్న సినిమాల్లో ‘హైవాన్’, ‘భాగం భాగ్ 2’, ‘వెల్కమ్ టు ది జంగల్’, ‘హేరా ఫేరి 3’ వంటి చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు, ఇంకొన్ని కొత్త స్క్రిప్టులు కూడా అక్షయ్ వింటున్నాడని సమాచారం.
వెంకటేష్ నటించిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాకి మంచి కుటుంబ ప్రేక్షక ఆదరణ లభించడంతో, దాన్ని హిందీలో రీమేక్ చేయాలని మొదట ప్రొడ్యూసర్స్ ఆసక్తి చూపినా, ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్‌కి అక్షయ్ లైన్‌లో లేనట్టుగా తెలుస్తోంది.
Also Read: 'రాజా సాబ్' లేట్ కి బన్నీ సినిమానే కారణం? అసలేం జరిగిందంటే..
అక్షయ్ కుమార్ ఈ రీమేక్ చేయటం లేదన్న వార్తలు అధికారికంగా రావాల్సి ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ జరుగుతుందో లేదో, అన్నది చూడాలి.