Sritej: అల్లు అర్జున్ కు మరో బిగ్ షాక్.. శ్రీతేజ్ కు సీరియస్!

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ బాలుడికి వెంటిలేటర్‌ సాయంతో శ్వాస అందిస్తున్నట్లు సమాచారం. శ్రీతేజ్ దాదాపు 11 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఇక శ్రీతేజ్ ఆరోగ్యంపై కుటుంబసభ్యుల ఆందోళన చెందుతున్నారు. 

New Update
allu arjun (1),.

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ బాలుడికి హాస్పిటల్‌లో వెంటిలేటర్‌ సాయంతో వైద్యులు శ్వాస అందిస్తున్నట్లు సమాచారం. శ్రీతేజ్‌కు పీడియాట్రిక్ ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 11 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఇక శ్రీతేజ్ ఆరోగ్యంపై కుటుంబసభ్యుల ఆందోళన చెందుతున్నారు.

ఏం జరిగిందంటే?

పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదల అయింది. దీనికంటే ఒకరోజు ముందు అంటే డిసెంబర్ 4న ప్రిమియర్ షో చూసేందుకు అల్జు అర్జున్ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంథ్య థియేటర్‌కు వెళ్లాడు. ఈ క్రమంలోనే తమ అభిమాన హీరోను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే రేవతి అనే మహిళా తన కొడుకు, భర్తతో కలిసి సంథ్య థియేటర్‌కు వెళ్లారు.

Also Read: విషాదం.. యువ రైతు ప్రాణం తీసిన అప్పులు

అయితే అభిమానుల తాకిడి ఎక్కువకావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి, 7 ఏళ్ల శ్రీ తేజ్ కిందపడిపోయారు. ఈ తొక్కిసలాటలో రేవతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. శ్రీ తేజ్ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ బాలుడికి జరగరానిది ఏమైనా జరిగితే బన్నీకి మరో సమస్య తలెత్తినట్లే అని చెప్పాలి.  

Also Read: అల్లు అర్జున్‌కు పవన్ కళ్యాణ్ దిమ్మతిరిగే షాక్!

బన్నీని కలుసుకోని పవన్

మరోవైపు ఈ ఘటనతో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం మధ్యంతర బెయిల్‌తో బన్నీ ఇంటికొచ్చేశాడు. దీంతో చాలామంది తెలుగు హీరోలు పరామర్శించేందుకు బన్నీ ఇంటికి చేరుకున్నారు. ఇక హీరో అల్లు అర్జున్ కు తన మామ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. హైదరాబాద్‌కు వచ్చిమరీ బన్నీని కలవకుండానే ఏపీకి వెళ్లిపోయారు పవన్‌ కళ్యాణ్. విజయవాడ నుంచి రాత్రి హైదరాబాద్‌ కు పవన్ వచ్చారు. అయితే జైలు  నుంచి విడుదలైన అల్లు అర్జున్‌ను కలవడానికే హైదరాబాద్ వచ్చారని ప్రచారం జరిగింది.

ఆ ప్రచారానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించారు. అందరి ఊహలకు, చర్చలకు చిక్కకుండా..  వ్యక్తిగత పని మీద వచ్చి తిరిగి వెళ్లిపోయారని టాక్ నడుస్తోంది. అరెస్ట్ తర్వాత అల్లు అర్జున్‌కు మెగా పరామర్శ  దక్కలేదు. టాలీవుడ్ మొత్తం క్యూ కట్టినా బన్నీని మెగా హీరోలు కలవకపోవడం చర్చనీయాంశమైంది. 

Also Read: కల్తీ లడ్డూ వివాదం.. తిరుమలలో సిట్ అధికారులు!

Also Read: సీఎంకి తలనొప్పిగా మారిన నాటుకోడి చికెన్ వివాదం.. వీడియో వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు