Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చిన సంయుక్త మీనన్..

'అఖండ 2' మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కానుందని హీరోయిన్ సంయుక్త మీనన్ తెలిపారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళ్లిన ఆమె దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా తనకు మంచి అనుభూతిని కలిగించింది అని అన్నారు.

New Update
Akhanda 2

Akhanda 2

Akhanda 2: ప్రస్తుతం, బాలకృష్ణ(Balakrishna), బోయపాటి(Boyapati) సూపర్ హిట్ సినిమా "అఖండ" సీక్వెల్ "అఖండ 2 – తాండవం" షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా, మహాకుంభమేళాలో కొన్ని సీన్స్‌ షూట్ చేసారు. తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో మరో షెడ్యూల్ కూడా పూర్తిచేశారు.

అయితే, అఖండ 2 మూవీ రిలీజ్ డేట్ పై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. అఖండ 2 లో బాలయ్య బాబు  సరసన హీరోయిన్ గా నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది క్రేజీ బ్యూటీ సంయుక్త మీనన్ అయితే ఈ విషయాన్నీ అఖండ 2 మూవీ టీమ్ గత జనవరి లోనే అనౌన్స్ చేసారు. తెలుగులో వరుస హిట్లు కొడుతూ మంచి క్రేజ్ సంపాదించుకుంది సంయుక్త. 

Also Read: Court Movie: కంటెంట్ ముఖ్యం బిగులు.. పావురాలు ఎగరేస్తూ 'కోర్ట్' టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్!

సెప్టెంబర్ రిలీజ్..

అయితే  రీసెంట్ గా సంయుక్త మీనన్  శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళ్లింది. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశ్వీరదించగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సంయుక్త మాట్లాడుతూ అఖండ 2 లో బాలయ్య తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానని, ఈ సినిమా తనకు  మంచి అనుభూతిని కలిగించింది అని, అయితే ఇక ఈ మూవీ సెప్టెంబర్ లో విడుదల అవుతోందని సంయుక్త తెలిపింది. 

Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!

Also Read: DIL Raju: విజయ్ సినిమాపై నోరు జారిన దిల్ రాజ్.. వెంటనే సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు