Samantha Love: రాజ్‌ నిడిమోరుతో సమంత దీపావళి సంబరాలు.. ఫొటోలు ఎంత ముద్దుగున్నాయో?

నటి సమంత, దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. రాజ్‌ కుటుంబంతో దిగిన ఫొటోలను సమంత పంచుకోగా, అవి వైరల్ అయ్యాయి. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలకు ఇది మరింత బలాన్నిచ్చింది. దీనిపై ఇద్దరూ అధికారికంగా స్పందించలేదు.

New Update
samantha-ruth-prabhu-celebrates-diwali-with-raj-nidimoru

samantha-ruth-prabhu-celebrates-diwali-with-raj-nidimoru

నటి సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ తాజాగా సమంత, రాజ్ నిడిమోరుతో కలిసి దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. రాజ్ నిడిమోరు కుటుంబ సభ్యులతో కలిసి సమంత దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

samantha celebrates diwali 2025

తన దీపావళి వేడుకల ఫోటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. బాణసంచా కాల్చుతూ, దీపాలు వెలిగిస్తూ సందడి చేసిన ఆ ఫొటోలలో ఒకదానిలో దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఆమె కనిపించారు. ఆకుపచ్చని సంప్రదాయ దుస్తుల్లో సమంత, నీలం రంగు కుర్తాలో రాజ్ చాలా ఉల్లాసంగా, నవ్వుతూ కనిపించారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ సామ్ "కృతజ్ఞతతో నిండిపోయింది" ("Filled with gratitude") అనే క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

ఇదిలా ఉంటే 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2', రాబోయే 'సిటడెల్: హనీ బన్నీ' వంటి ప్రాజెక్టులకు సమంత, రాజ్-డీకే కలిసి పనిచేశారు. అప్పటి నుంచి రాజ్, సమంత మధ్య స్నేహం మరింత బలపడింది. పండుగ వేడుకల్లో ఇద్దరూ కలిసి కనిపించడం, గతంలో 'శుభం' సినిమా ప్రమోషన్స్‌లో రాజ్ భుజంపై సమంత తల ఆనించి దిగిన ఫోటోలు వైరల్ అవ్వడం, తిరుపతి ఆలయాన్ని కూడా కలిసి సందర్శించడం వంటి సంఘటనలు ఈ డేటింగ్ వార్తలకు మరింత ప్రాధాన్యం ఇచ్చాయి. 

అయితే ఈ డేటింగ్ వార్తలపై సమంత కానీ, రాజ్ నిడిమోరు కానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ఒకానొక సందర్భంలో సమంత మేనేజర్ మాత్రం ఇవి కేవలం పుకార్లేనని స్పష్టం చేశారు. అయినప్పటికీ, దీపావళి సంబరాల ఫోటోలు మళ్ళీ అభిమానుల మధ్య చర్చకు దారితీశాయి. రాజ్ నిడిమోరు గతంలో శ్యామలీ దేతో వివాహం చేసుకున్నారు. 2022లో వారు విడాకులు తీసుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, రాజ్ రెండో పెళ్లికి చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో ఈ ఫోటోలు ఈ జంట మధ్య వ్యక్తిగత బంధంపై మరింత సందేహాలను, చర్చను పెంచాయి. సినిమాల విషయానికొస్తే, సమంత ప్రస్తుతం 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్' ప్రాజెక్టులో నటిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు