కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత స్పందించింది. విడాకులు నా వ్యక్తిగత విషయమని.. ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని పేర్కొంది. ఇందులో రాజకీయ నేతల ప్రమేయం లేదని స్పష్టం చేసింది. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించింది. '' ఒక మహిళగా బయటికి వచ్చి, గ్లామరస్ ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా సాహసం, శక్తి అవసరం. కొండా సురేఖ గారు.. నా జీవిత ప్రయాణంపై నేను గర్వపడుతున్నాను. దీన్ని చిన్న చూపు చూడకండి. ఒక మంత్రిగా మీ వ్యాఖ్యలు ప్రభావం చూపిస్తాయని మీరు గ్రహిస్తారని భావిస్తున్నాను. వ్యక్తుల ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాను.
నా విడాకులు అనేవి వ్యక్తిగత విషయం. ఈ విషయం పట్ల దూరంగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను. ఇద్దరి పరస్పర అంగీకారంతోనే మా విడాకులు జరిగాయి. ఇందులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదు. రాజకీయాల నుంచి నా పేరు దూరంగా ఉంచండి. నేనెప్పుడు రాజకీయాలకు దూరంగానే ఉంటా. అలాగే ఉండటం కొనసాగిస్తానని'' సమంత తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.