/rtv/media/media_files/2025/06/01/y9XvqeIO8zCzFhks616N.jpg)
Raj Nidimoru wife Shyyamali De Cryptic post
Samantha: టాలీవుడ్ నటి సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు డేటింగ్ లో ఉన్నారంటూ గత కొద్దిరోజులుగా నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాజ్ నిడిమోరు భార్య ష్యామాలి తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ క్రిప్టిక్ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఒక ప్లానెట్ ఫొటోను షేర్ చేస్తూ.. కాలమే అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది. విశ్వం వినయాన్ని నేర్పుతుంది అంటూ ఓ మెసేజ్ షేర్ చేశారు. దీంతో రాజ్- సమంత డేటింగ్ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. రాజ్- సమంతల గురించి వస్తున్న వార్తలపై సూటిగా స్పందించకపోయినా .. ఇలా పరోక్షంగా స్పందిస్తున్నారా? అని అనుకుంటున్నారు నెటిజన్లు.
Also Read : బిగ్ బ్రేకింగ్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ప్రాంతాల వారీగా లిస్ట్ ఇదే
ష్యామాలి పోస్ట్
ఇటీవలే మరో పోస్ట్
ష్యామాలి ఇలా తన సోషల్ మీడియాలో రహస్య పోస్టులు షేర్ చేయడం ఇది రెండోసారి. ఇటీవలే సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాజ్‌తో కలిసి ఒక సెల్ఫీ షేర్ చేసిన.. కొద్ది గంటలకే ''నా గురించి ఆలోచించేవారితో పాటు, నన్ను చూసే, నన్ను వినే, నాతో మాట్లాడే, నా గురించి వ్రాసే వారందరికీ నా ఆశీస్సులు, ప్రేమను పంపుతాను'' అని నోట్ షేర్ చేసింది.
అయితే ఇప్పటివరకు ఈ వ్యవహారంపై రాజ్, సమంత, లేదా శ్యామలి ఎవ్వరూ స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే.. రాజ్- నిడిమోరు శ్యామాలి వివాహం చేసుకొని పదేళ్లు అయ్యింది. శ్యామాలి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అంతేకాదు ఓంప్రకాష్ మెహ్రా , విశాల్ భరద్వాజ్ వంటి చిత్రనిర్మాతలతో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. వీరిద్దరికీ ఒక కుమార్తె కూడా ఉందని సమాచారం. అయితే రాజ్, శ్యామలీ విడిపోతున్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు కూడా వచ్చాయి.
Also Read: Manchu Brothers: అంతా మనోజే చేయించాడు..కన్నప్ప హార్డ్ డ్రైవ్ విషయంలో విష్ణు సంచలన కామెంట్స్