Subham Box Office Collections: 'శుభం' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. బొమ్మ హిట్టా ఫట్టా..?

సమంత నిర్మాతగా తీసిన తొలి చిత్రం ‘శుభం’.. హార్రర్ కామెడీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది. అయితే మొదటి రోజు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేకున్నా, తొలి వీకెండ్‌ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.5.25 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

New Update

Subham Box Office Collections: సమంత(Samantha) తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం ‘శుభం’ థియేటర్లలో ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, హార్రర్, కామెడీ నేపథ్యంలో సాగుతుంది. విడుదలైన మొదటి రోజు నుండే సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో మూవీ టీమ్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Also Read: 'ఈట్.. స్లీప్.. సలార్'.. బొమ్మ వచ్చి 500 రోజులు దాటినా ఊపు తగ్గలేదుగా!

ప్రపంచవ్యాప్తంగా రూ.5.25 కోట్లు వసూళ్లు

అయితే సినిమాకి పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ, మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద వచ్చిన కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. తొలి వీకెండ్ ముగిసే సరికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.5.25 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించిందని నిర్మాతలు వెల్లడించారు.

Also Read: 'పెద్ది' అంతకు మించి..! ఇక రికార్డులు గల్లంతే..

ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరీ, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని ముఖ్య పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం ‘శుభం’ మంచి మౌత్ టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. ఇకపోతే, ఫైనల్ రన్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం ఎంత మొత్తంలో వసూళ్లు రాబడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read: ఈ రేంజ్ కలెక్షన్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా! #సింగిల్ వరల్డ్ వైడ్ ఎంతంటే..?

Advertisment
Advertisment
తాజా కథనాలు