సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మళ్ళీ స్పీడ్ పెంచింది. గత కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తోంది. త్వరలోనే ఈ హీరోయిన్ ప్రధాన పాత్ర పోషించిన 'సిటాడెల్ : హనీ, బన్నీ' అనే వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతుంది. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తో బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న సామ్.. ఇప్పుడీ సిరీస్ తో తన క్రేజ్ ను మరింత పెంచుకోవాలని చూస్తోంది.
Also Read : నాని - శ్రీకాంత్ ఓదెల సినిమాకు ఊరమాస్ టైటిల్
రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ సిరీస్ లో సమంతతో పాటూ బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ లీడ్ రోల్ లో నటించాడు. ఇటీవలే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అందులో సమంత యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేసింది. వచ్చే నెల అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సిరీస్ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో సమంత, వరుణ్ ప్రెజెంట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.
Also Read : మరో టాలీవుడ్ ఆఫర్ అందుకున్న 'ఉప్పెన' బ్యూటీ.. ఈసారి మాస్ హీరోతో
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వరుణ్ ధావన్.. సమంతపై కొందరు నెగిటివ్గా మాట్లాడిన విషయాలను బయట పెట్టాడు." సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ చూసి నేను బాగా ఎంజాయ్ చేశాను. సమంతతో నటించాలని ముందే నిర్ణయించుకున్నాను. ‘సిటాడెల్’ ఆఫర్ వచ్చినప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ఆ సమయంలో నాతో కొంత మంది సమంతపై నెగిటివ్ గా మాట్లాడారు.
Also Read : ఓటీటీలోకి ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
సామ్ తో నటించొద్దని అన్నారు..
సమంతతో పని చేయవద్దు, ఆమెకు ఆటిట్యూడ్ ఎక్కువ. పైగా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. షూటింగ్ కూడా టైమ్ కు పూర్తి చేయదు. మీ పెయిర్ కూడా కుదరదన్నారు. అయితే నేను సమంతతో కలిసి పనిచేస్తానని వారితో చెప్పాను.." అని అన్నాడు. అయితే సామ్ తో నటించొద్దని చెప్పిన వాళ్ళ పేరును వరుణ్ ధావన్ బయటపెట్టలేదు. బహుశా సమంత అంటే పడని వాళ్ళే వరుణ్ తో ఇలా చెప్పుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read : 'గేమ్ ఛేంజర్' డ్యూయెట్ సాంగ్ కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?