Family Man 3 Glimpse: ఫ్యామిలీ మ్యాన్ 3 గ్లింప్స్ వచ్చేసింది! ఈసారి సామ్ మరింత వైల్డ్ గా

మనోజ్ బాజ్ పాయ్, సమంత ప్రధాన పాత్రలో నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3 గ్లిమ్ప్స్ వచ్చేసింది. ఈ సీజన్ లో సామ్ ఫుల్ యాక్షన్ మోడ్ లో మరింత వైల్డ్ గా కనిపించింది.

New Update

Family Man 3 Glimpse:  అమెజాన్ సూపర్ హిట్ సీరీస్ 'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3 త్వరలోనే ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మనోజ్ బాజ్ పాయ్, సమంత ప్రధాన పాత్రలో  ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సీరీస్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే  విడుదల తేదీని  ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేందుకు తాజాగా చిన్న గ్లింప్స్  వీడియో రిలీజ్ చేశారు. 

గ్లింప్స్  వీడియో

గత సీజన్ కంటే ఈ సీజన్ యాక్షన్, థ్రిల్ ఇంకాస్త ఎక్కువగా ఉండబోతున్నట్లు గ్లింప్స్  వీడియో చూస్తే అర్థమవుతోంది.  సమంత ఫుల్ యాక్షన్ మోడ్ లో మరింత వైల్డ్ గా కనిపించింది. అలాగే  శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్ పాయ్) గూఢచారి జీవితం అతని కుటుంబ జీవితాన్ని మరింత ప్రభావితం చేయనున్నట్లు తెలుస్తోంది.  సీజన్ 3లో కొన్ని కొత్త పాత్రలు కూడా కనిపించాయి. ఈ కొత్త పాత్రలు కథకు మరింత ఉత్కంఠను జోడిస్తాయని భావిస్తున్నారు.

Also Read:Law student gang rape: కాళ్లు పట్టుకున్నా వదల్లేదు.. కోల్‌కతా రేప్ కేసులో షాకింగ్ విషయాలు

ఫ్యామిలీ మ్యాన్ కథేంటి?

 ఓ మధ్యతరగతి వ్యక్తి ( శ్రీకాంత్ తివారీ)  తాను గూఢచారి అన్న విషయం కుటుంబానికి తెలియకుండా, దేశ రక్షణ కోసం ఇంటెలిజెన్స్  ఆఫీసర్  గా పనిచేస్తుంటాడు. శ్రీకాంత్ తివారీ  దేశ రక్షణతో పాటు  కుటుంబ సమస్యలతో ఎలా పోరాడతాడు అనేది ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ కథ. ఇప్పటికే విడుదలైన సీజన్ 1 అండ్ సీజన్ 2 భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో సీజన్ 3 కూడా ప్లాన్ చేశారు మేకర్స్.  రాజ్ అండ్ డీకే ఈ సీరీస్ ని రూపొందించారు. 

Also Read: Shefali Jariwala: గుండె పోటు కాదు.. షఫాలీ పోస్ట్‌మార్టంలో బయటపడ్డ సంచలనాలు!

Advertisment
తాజా కథనాలు