/rtv/media/media_files/2025/07/06/samantha-emotional-at-tana-2025-event-2025-07-06-11-53-35.jpg)
Samantha emotional at TANA 2025 Event
Samantha: గత కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మళ్ళీ సినిమాలతో బిజీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే అమెరికాలో జరిగిన తానా 2025 (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ఈవెంట్ కి హాజరైంది. అయితే ఈ ఈవెంట్ లో సామ్ ప్రసంగం అందరినీ కదిలించింది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలబడిన సమంత, వేదికపై మాట్లాడుతూ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.
#SamanthaRuthPrabhu gets Emotional during her speech at #TANA Conference 2025.#TANA2025pic.twitter.com/sFpx7K0BlM
— Gulte (@GulteOfficial) July 6, 2025
Also Read: The 100 Trailer: 'మొగలిరేకులు' RK నాయుడు ఈజ్ బ్యాక్.. పవర్ స్టార్ చేతులు మీదుగా 'ది 100' ట్రైలర్!
నాకొక ఐడెంటిటీ ఇచ్చారు
సామ్ మాట్లాడుతూ.. నా జీవితం ఒక యుద్ధం. నేను ఎదుర్కొన్న సవాళ్లు చాలా పెద్దవి" అని అన్నారు. ''నా తొలి సినిమా ‘ఏమాయ చేసావె’ నుంచి నన్ను మీ మనిషిలా ఆదరించారు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు చెప్పడానికి ఇన్నేళ్లు పట్టింది అంటూ అమెరికాలోని తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇన్నేళ్ల ప్రయాణంలో నాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచారు. మీరు నాకొక ఐడెంటిటీ, కుటుంబాన్ని ఇచ్చారు. ఇక్కడ(అమెరికా) 'ఓబేబీ' సినిమా క్లబ్‌లోకి చేరడం మీవల్లే సాధ్యమైంది. ప్రాంతాల పరంగా మీరు నాకు దూరంగా ఉండొచ్చు.. కానీ మీరెప్పటికీ నా మదిలోనే ఉంటారు అంటూ కంటతడి పెట్టుకున్నారు.
Also Read: Ashu Reddy: బీచ్ లో చెమటలు పట్టిస్తున్న ఆశు.. ఫొటోలు చూస్తే అంతే!