HIT 3: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి హిట్ ఫ్రాంచైజీ 'హిట్3'. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం మే1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'ప్రేమ వెల్లువ' సాంగ్ విడుదల చేశారు. ఇందులో రొమాంటిక్ మెలోడీ మ్యూజిక్ తో పాటుగా నాని, శ్రీనిధి శెట్టి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
ఇది కూడా చూడండి:SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
The breather.#PremaVelluva is here .. @MickeyJMeyer 🙏🏼@SrinidhiShetty7 ♥️https://t.co/U0acryOE41pic.twitter.com/84jnldgyp2
— Nani (@NameisNani) March 24, 2025
ఇప్పటికే విడుదలైన రెండు పార్టులు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. హిట్ 3 పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా నాని రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తూ.. మరింత ఆసక్తిని పెంచారు.
ఇది కూడా చూడండి:Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి
ప్రీ రిలీజ్ బిజినెస్
ఇదిలా ఉంటే 'హిట్3' ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ రూ. 54కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. వరుస హిట్లతో సినిమా సినిమాకు నాని డిమాండ్ పెరుగుతున్నట్లు ఈ ఓటీటీ డీల్ చూస్తుంటే అర్థమవుతుంది.
telugu-news | cinema-news | Hit 3 Song | Prema Velluva hit 3 song
ఇది కూడా చూడండి: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!