Salman Khan: సల్మాన్ కి 'ఆత్మహత్య వ్యాధి'.. కపిల్‌ శర్మ షోలో ఎమోషనల్

స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ట్రైజెమినల్ న్యూరాల్జియా అనే తీవ్రమైన నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ట్రైజెమినల్ న్యూరాల్జియా వ్యాధిని "ఆత్మహత్య వ్యాధి" అని కూడా పిలుస్తారు. ఇది ముఖ భాగంలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది.

New Update
Salman Khan Battle with Trigeminal Neuralgia Disease

Salman Khan Battle with Trigeminal Neuralgia Disease

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని తెలియడం ఫ్యాన్స్ ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషయాన్ని సల్మాన్ స్వయంగా బయటపెట్టారు. అయితే  కొంతకాలంగా సల్మాన్ ఆరోగ్యంపై  రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే  'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' లో  పాల్గొన్న సల్మాన్ ఖాన్ తన ఆరోగ్యం గురించి నోరువిప్పారు. తనకు ట్రైజెమినల్ న్యూరాల్జియా (Trigeminal Neuralgia) అనే తీవ్రమైన నరాల సంబంధిత వ్యాధి ఉందని..  గత కొంతకాలంగా దానితో బాధపడుతున్నానని వెల్లడించారు.  ట్రైజెమినల్ న్యూరాల్జియా వ్యాధిని "ఆత్మహత్య వ్యాధి" అని కూడా పిలుస్తారు. ఇది ముఖ భాగంలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుందిఇదిలా ఉంటే గతంలో కూడా సల్మాన్ తనకు  మెదడుకు సంబంధించిన   అన్యూరిజం (Aneurysm), AV Malformation  సమస్యలు  ఉన్నాయని తెలిపారు.

Also Read: Salman Khan: సల్మాన్ కి 'ఆత్మహత్య వ్యాధి'.. కపిల్‌ శర్మ షోలో ఎమోషనల్

AV Malformation? 

అన్యూరిజం అనేది  రక్తనాళాలు ఉబ్బిపోయే పరిస్థితి! ఇలాంటి స్థితిలో అవి చీలితే అంతర్గత రక్త స్రావం జరిగి.. స్ట్రోక్ లేదా మరణానికి దారితీయవచ్చు. అలాగే  AV Malformation  అనేది  పుట్టుకతో వచ్చే ఒక అరుదైన పరిస్థితి.  ఇందులో  మెదడులోని ధమనులు, సిరలు ఒకదానితో ఒకటి అస్తవ్యస్తంగా పెనవేసుకొని ఉంటాయి. దీనివల్ల రక్తం వేగంగా ప్రవహిస్తుంది మరియు రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది మెదడులో రక్తస్రావం (హెమరేజ్), మూర్ఛలు లేదా ఇతర నాడీ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

Also Read: Ghaati Movie: అనుష్క కొత్త మూవీ సాంగ్ ధూం ధాం.. బీట్ వింటే ఊపు రావాల్సిందే

ట్రైజెమినల్ న్యూరాల్జియా?

ట్రైజెమినల్ న్యూరాల్జియా అనేది ముఖానికి సంభందించిన ట్రైజెమినల్ నరాలను ప్రభావితం చేసే ఒక దీర్ఘకాలిక నొప్పి.  ఈ వ్యాధి ఉన్నవారికి ముఖంలో తీవ్రమైన, ఆకస్మికంగా  షాక్ కొట్టినట్లుండే నొప్పి కలుగుతుంది. ఇది కొన్ని సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు ఉంటుంది. పళ్ళు తోముకోవడం, ముఖం కడుక్కోవడం, గడ్డం గీసుకోవడం వంటి చిన్న చిన్న పనులు చేసిన కూడా ఈ నొప్పి మొదలవుతుంది.

సల్మాన్ ఖాన్ కూడా..  మాట్లాడేటప్పుడు, తినేటప్పుడు, త్రాగేటప్పుడు ఈ నొప్పి వస్తుందని తెలిపారు. ఈ సమస్యలతోనే తాను జీవితాన్ని కొనసాగిస్తున్నాని ఎమోషనల్ అయ్యారు. వీటిని అధికమించేందుకు తనను తాను రీస్టార్ట్ రీస్టార్ట్‌ చేసుకుంటున్నానని  అన్నారు.  అయితే  సల్మాన్ 2017లో ఈ వ్యాధికి అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు సమాచారం.  ఏదేమైనా సల్మాన్  ఇలా  తన ఆరోగ్య సమస్యలను ధైర్యంగా పంచుకోవడం చాలా మందికి స్ఫూర్తినిచ్చింది.

Also Read: kuberaa Box Office collections: అమెరికాలో కుబేరా కలెక్షన్ల వర్షం.. రెండు రోజుల్లోనే ఎంత వసూలు చేసిందంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు