Sai pallavi : సుకుమార్ నెక్స్ట్ సినిమాలో సాయి పల్లవి.. హీరో ఎవరంటే?

'పుష్ప2' తర్వాత సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా సాయిపల్లవిని అనుకుంటున్నారట. త్వరలోనే ఆమెకు కథను కూడా వినిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్‌తో చేయనున్న ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర కీలకంగా ఉంటుందట.

New Update
sukumar

'పుష్ప' మూవీతో సుకుమార్ కు పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు రావడంతో ఆయన తదుపరి సినిమాలపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ఈ డైరెక్టర్ త్వరలో 'పుష్ప2' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

ఈ క్రమంలోనే ఆయన డైరెక్ట్ చేయబోయే నెక్స్ట్ మూవీకి సంబంధించి ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. అదేంటంటే.. సుకుమార్ నెక్స్ట్ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి భాగం కానుందట. 'పుష్ప2' తర్వాత సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు.

చరణ్ కు జోడిగా..

'RC17'  వర్కింగ్‌ టైటిల్‌తో మొదలయ్యే ఈ సినిమా కథకు సంబంధించిన కసరత్తులు కూడా మొదలయ్యాయని సమాచారం. ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో సుకుమార్‌ ఈ కథను రెడీ చేస్తున్నారని తెలుస్తున్నది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇందులో హీరోయిన్‌గా సాయిపల్లవిని అనుకుంటున్నారట.

అంతేకాదు త్వరలోనే ఆమెకు కథను కూడా వినిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సుకుమార్‌ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు బలంగా ఉంటాయి. రామ్ చరణ్‌తో చేయనున్న ఈ సినిమాలో కూడా హీరోయిన్‌ పాత్ర కీలకంగా ఉంటుందట. అందుకే ఆ రోల్ కోసం సాయి పల్లవిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

Also Read: షారుఖ్, సల్మాన్ కాదు.. భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈ తెలుగు హీరోదే..? ఒక్క సినిమాకు 300 కోట్లు

Advertisment
తాజా కథనాలు