RRR Documentry: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. అయితే ఈ సినిమా తెర వెనుక జరిగిన సంఘటనలను 'RRR బిహైండ్ అండ్ బియాండ్' ది సీన్స్ అనే డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల తీసుకొచ్చారు మేకర్స్. ఈ నెల 20 న థియేటర్స్ లో విడుదలైన ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు ఓటీటీ ప్రియులను కూడా అలరించేందుకు సిద్ధమైంది. Also Read: Year Ender2024: తెలుగులో సత్తా చాటిన బాలీవుడ్ బ్యూటీస్.. సౌత్ భామలు కూడా అక్కడ.. ఓటీటీలో స్ట్రీమింగ్.. 'RRR' బిహైండ్ ది సీన్స్ డాక్యుమెంటరీ ఈనెల 27 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్. ఇందులో షూటింగ్ సమయంలో చరణ్, తారక్ అల్లరి, యాక్షన్ సీన్స్ చిత్రీకరించిన విధానం ఎంతో ఆసక్తికరంగా కనిపించాయి. థియేటర్స్ లో మిస్సైన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. Behind the scenes, beyond the legacy. Watch RRR: Behind and Beyond, an exclusive peek into the making of SS Rajamouli"s magnum opus on Netflix, out 27 December!#RRRBehindAndBeyondOnNetflix pic.twitter.com/Py9pyL7Nws — Netflix India South (@Netflix_INSouth) December 23, 2024 RRR ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించడంతో పాటు.. నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో ఆస్కార్ గెలుచుకున్న తొలి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో కొమురం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ నటన భారతీయ ప్రేక్షకులతో పాటు, అంతర్జాతీయ ప్రేక్షకులను సైతం ఫిదా చేసింది. Also Read: సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ కు ప్రముఖ హీరోయిన్ సపోర్ట్, రేవంత్ పై ఫైర్