Year Ender2024: తెలుగులో సత్తా చాటిన బాలీవుడ్ బ్యూటీస్.. సౌత్ భామలు కూడా అక్కడ.. బాహుబలి, RRR సినిమాలతో తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళింది. దీంతో బాలీవుడ్ స్టార్లు సైతం తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అలా ఈ ఏడాది తెలుగులో అడుగుపెట్టి సత్తాచాటిన బాలీవుడ్ బామలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 25 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/8 అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. దేవరలో తంగం పాత్రలో అచ్చతెలుగు అమ్మాయిగా కనిపించి మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ మనసుని దోచేసింది. ఈ సినిమాలో జాన్వీ గ్లామర్, డాన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. 2/8 'దేవర' తో హిట్టు కొట్టిన జాన్వీ.. అదే జోష్ తెలుగులో మరో ఛాన్స్ కొట్టేసింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC16 రామ్ చరణ్ సరసన నటించనుంది. 3/8 దీపికా పడుకొనే ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ 'కల్కి 2898 ఎడి' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో దీపికా సుమతి పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అదేవిధంగా 2024లో సౌత్ హీరోయిన్లు కూడా బాలీవుడ్ లో సత్తాచాటారు. ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. 4/8 మిల్కీ బ్యూటీ తమన్నా సినిమాల్లో కనిపించినప్పటికీ 'స్త్రీ2', వేదా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో స్టెప్పులేసి ఆడియన్స్ ని ఫిదా చేసింది. యూట్యూబ్ ఈ సాంగ్స్ మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకున్నాయి. 5/8 రాశీఖన్నా సబర్మతి రిపోర్ట్ సినిమాతో ఈ ఏడాది బాలీవుడ్ లో భారీ హిట్టు అందుకుంది. యదార్థ సంఘటనలతో తెరకెక్కిన ఈ చిత్రం విపరీతమైన ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమా సక్సెస్ తో హిందీలో రాశీ క్రేజ్ మరింత పెరిగింది. రూ. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. 6/8 టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న బుట్టబొమ్మ పూజ హెగ్డే ఈ ఏడాది బాలీవుడ్ లో వరుస అవకాశాలు సొంతం చేసుకొని సత్తాచాటింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హిందీ రెండు ప్రాజెక్ట్స్ చేస్తోంది. 7/8 టాలీవుడ్ మహానటిగా పేరు తెచ్చుకున్న కీర్తి .. ఈ ఏడాది బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లో సత్తాచాటేందుకు సిద్ధమైంది. నేడు విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ వస్తోంది. 8/8 రష్మిక 'పుష్ప 2' సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్టు అందుకుంది. ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ దక్కింది. ఈ మూవీతో రష్మిక పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి