NTR NEEL: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీలో మరో స్టార్ హీరో.. థియేటర్లు బ్లాస్ట్ పక్కా..!

ఎన్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘డ్రాగన్‌’(వర్కింగ్ టైటిల్)లో కన్నడ స్టార్‌ రిషబ్‌ శెట్టి అతిథి పాత్రలో కనిపించనున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొత్త లుక్ జిమ్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి.

New Update
NTR NEEL

NTR NEEL

NTR NEEL: ఎన్టీఆర్‌, డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం షూటింగ్ వేగంగా సాగుతోంది. ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాపై ఇప్పటికే ఎంతో హైప్ క్రియేట్‌ అయ్యింది. ‘KGF’, ‘సలార్’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలతో పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్, ‘RRR’ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్‌తో కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లోనే కాదు, ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read:'మార్కో' స్టార్ హీరోగా మోదీ బయోపిక్.. టైటిల్ ఏంటో తెలుసా..?

గెస్ట్ రోల్‌లో రిషబ్ శెట్టి..

ఈ సినిమాలో ఓ స్పెషల్ అట్రాక్షన్‌గా ఒక అతిథి పాత్ర కూడా ఉంటుందని సమాచారం. అయితే ఆ గెస్ట్ రోల్‌లో మెరవబోయే నటుడు మరెవరో కాదు 'కాంతారా' ఫేమ్‌ రిషబ్ శెట్టి(Rishab Shetty). తెలుగులో ‘కాంతారా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రిషబ్, ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు. అతిథి పాత్ర అయినా కథలో ముఖ్యమైన మలుపును ఇవ్వబోతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలోనే రిషబ్‌ షూటింగ్‌లో పాల్గొననున్నారని సమాచారం.

Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!

ఇది పక్కన పెడితే, ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ సినిమాకోసం శారీరకంగా ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఉన్నాడు. జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ సిద్ధమవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆయన లుక్ ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ యూఎస్ కాన్సులేట్‌ను కూడా సందర్శించాడు. కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌తో సమావేశమైన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లారా విలియమ్స్‌ మాట్లాడుతూ, ఈ సినిమా అమెరికాలో షూటింగ్ కావడంతో అమెరికా-భారత్ మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలపడతాయని, అలాగే ఉద్యోగాల పరంగా కూడా ఇది ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు.

Also Read: ప్రభాస్ - ప్రశాంత్ వర్మ బిగ్ సర్ప్రైజ్.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ఇది..!!

ఈ ప్రాజెక్ట్‌ బడ్జెట్ పరంగా కూడా భారీ స్థాయిలో ప్లాన్‌ చేస్తున్నారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన సినిమా కానుంది. ఈ సినిమా బడ్జెట్ రూ.350 కోట్ల నుంచి రూ.360 కోట్ల మధ్య ఉండనుందని సమాచారం. ఇందులో భారీ యాక్షన్ సీన్లు, హై-క్వాలిటీ గ్రాఫిక్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

Also Read: రామ్ చరణ్ “పెద్ధి” ఇంట్రెస్టింగ్ అప్డేట్: అమ్మగా ‘అఖండ’ నటి!

ఇక హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారన్న విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, కన్నడ నటి రుక్మిణి వసంత్‌ ఎన్టీఆర్‌కు జోడీగా నటించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇంకా ఇతర ముఖ్య పాత్రల విషయంలోనూ త్వరలోనే క్లారిటీ రావొచ్చని తెలుస్తోంది. ఇలాంటి అన్ని ఆసక్తికర అంశాలతో కూడిన ‘ఎన్టీఆర్ 31’ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం 2026లో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ మాస్‌, క్లాస్‌ లుక్‌లో అలరించబోతున్న ఈ సినిమాపై రోజుకో అప్‌డేట్ వస్తూ ఫ్యాన్స్‌ను హైప్‌లో పెంచుతోంది. 

Advertisment
తాజా కథనాలు