/rtv/media/media_files/2025/03/23/Pa4PdUUvfLh9D12jjxXq.jpg)
rhea chakraborty Photograph: (rhea chakraborty)
Bollywood: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు కొట్టివేసిన సందర్భంగా రియా చక్రవర్తి ఎమోషనల్ అయింది. ఈ కేసు వల్ల తాను ఎన్నో కష్టాలపాలయ్యానని చెప్పింది. తాను చేయని తప్పుకు 27 రోజులు జైలుశిక్ష అనుభవించానని, నాలుగేళ్లపాటు ఎన్నో అవమానాల పాలయ్యాయనంటూ భావోద్వేగానికి గురైంది.
Happy birthday to the most beautiful ” supermassive black hole “ that is known to mankind !
— Rhea Chakraborty (@Tweet2Rhea) January 21, 2020
Shine on you crazy diamond @itsSSR 💕💥❤️🌈⭐️🍭💜🧡 #boywithagoldenheart #rheality pic.twitter.com/jtHkbS3zbs
సోషల్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో తప్పుడు ప్రచారం..
ఈ సందర్భంగా రియా లాయర్ సతీష్ మనేషిండే సీబీఐకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడియ సతీష్.. రియా కుటుంబసభ్యులు మౌనంగా భరించి నిర్దోషులుగా బయటపడ్డారని చెప్పారు. సోషల్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో నిరాధార ఆరోపణల వల్ల ప్రముఖులు ఎంతో కృంగిపోతున్నారు. ఘటన అసలు కారణం తెలుసుకోకుండా అమాయకులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వారినే దోషులుగా చిత్రీకరించి ప్రజల ముందు నిలబెడుతున్నారు. ఇది సమాజానికి ప్రమాదం' అన్నారు.
Some kinda sunshine ☀️ #rheality pic.twitter.com/ncVIDsrGhD
— Rhea Chakraborty (@Tweet2Rhea) March 6, 2020
Also Read : జైలు భోజనం వద్దు.. డ్రగ్స్ కావాలని సాహిల్ డిమాండ్
అసలేం జరిగిందంటే..
2020 జూన్ 14న ముంబై బాంద్రాలో సుశాంత్ సింగ్ తన ఫ్లాట్‌లో అనుమానాస్పదంగా చనిపోయాడు. సుశాంత్ సూసైడ్ చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. అయినా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అది ఆత్మహత్య కాదని, ఆయన కుటుంబసభ్యులు నటి రియా చక్రవర్తి, ఆమె ఫ్యామిలీపై కేసు పెట్టారు. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రూ.15 కోట్లు బదిలీ చేసుకున్నారని సూశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. మనీలాండరింగ్ జరిగినట్లు భావించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రియాను అదుపులోకి ప్రశ్నించింది. నటుడి మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి 27 రోజులు జైలులో ఉన్నారు.
Also Read : తల్లి డైరెక్షన్.. కొడుకులు యాక్షన్.. షేక్ పేట చోరీ కేసులో బిగ్‌ట్విస్ట్
sushant-singh-rajput | rhea-chakraborty | telugu-news | today telugu news | latest-telugu-news