/rtv/media/media_files/2025/10/08/mass-jathara-2025-10-08-12-21-10.jpg)
Mass Jathara
Mass Jathara: మాస్ మహారాజా రవి తేజ(Ravi Teja) నటిస్తున్న కొత్త చిత్రం ‘మాస్ జాతర’పై ప్రస్తుతం భారీ హైప్ ఉంది. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, ఆయనకి దర్శకుడిగా ఇది తొలి ప్రాజెక్ట్ కావడం విశేషం. హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది.
Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రెండు పాటలు, టీజర్‌లు విడుదలయ్యాయి. తాజాగా విడుదలైన సుమతో ఇంటర్వ్యూ కూడా యూట్యూబ్‌లో మంచి వ్యూస్ తో ఆకట్టుకుంటోంది. ఈ క్రేజ్‌ను కొనసాగిస్తూ మేకర్స్ మూడో పాటను విడుదల చేశారు.
‘హుడియో హుడియో’.. ఆకట్టుకుంటున్న సాఫ్ట్ మెలోడీ (Mass Jathara 3rd Song)
తాజాగా రిలీజ్ అయిన మూడో సాంగ్ ‘హుడియో హుడియో’ ఒక సాఫ్ట్ మెలోడీగా ఆకట్టుకుంటోంది. హీరో తన ప్రేమను, హీరోయిన్‌పై ఉన్న ఫీలింగ్స్‌ను తెలియజేస్తూ సాగుతుంది. సంగీత దర్శకుడు హెషం అబ్దుల్ వాహబ్ స్వరపరిచిన ఈ పాట యూట్యూబ్ లో సందడి చేస్తోంది.
Also Read: పవన్ సినిమాలో విలన్‌గా మల్లా రెడ్డి.. ట్విస్ట్ ఏంటంటే..?
ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో కూడా గాత్రాన్ని అందించడం విశేషం. ఈ మెలోడీకి దేవ్ పవార్ సాహిత్యం అందించారు. పాటకు లిరికల్ వీడియో రూపంలో కొన్ని బీహైండ్ ది సీన్స్ (BTS) ఫన్ మూమెంట్స్‌ను కూడా చూపించారు. ఫ్యాన్స్‌కి ఇది స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.
Also Read: సోషల్ మీడియా నెగెటివిటీపై రవి తేజ వైరల్ కామెంట్స్!
ట్రైలర్ కోసం ఎదురుచూపులు
ఈ మెలోడీ పాటకు ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. అందరి దృష్టి ఇప్పుడు సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ మీద ఉంది. ట్రైలర్‌తో మూవీపై ఉన్న అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
Also Read: పవర్ స్టార్ 'ఓజీ' కలెక్షన్ల సునామీ.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!
ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (నాగ వంశీ), ఫార్చూన్ ఫోర్ సినిమాస్ (సాయి సౌజన్య) కలిసి నిర్మిస్తున్నారు. శ్రికర స్టూడియోస్ ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తోంది.
2025 అక్టోబర్ 31న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. రవి తేజ మాస్ గెటప్, శ్రీలీల గ్లామర్, పాటలు, పక్కా కమర్షియల్ కంటెంట్‌తో ఈ సినిమా ఫ్యాన్స్‌కు పండుగలా ఉండనుందని తెలుస్తోంది.