/rtv/media/media_files/2025/04/12/OD7AzLzoU7u67kH8pth0.jpg)
Ravi Teja Mass Jathara
Ravi Teja Mass Jathara: మాస్ మహారాజా రవితేజ మళ్లీ బాక్సాఫీస్ దగ్గర హిట్ ట్రాక్‌లోకి రాబోతున్నాడు. గత కొన్నిరోజులుగా ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో, ఈసారి మంచి కం బ్యాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో రవితేజ తాజా సినిమా 'మాస్ జాతర' అనే మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌కి అభిమానులలో మంచి హైప్ ఏర్పడింది.
భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజతో మరోసారి శ్రీలీల జతకడుతున్నారు. ‘ధమాకా’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈ జోడీ, మళ్లీ తెరపై కనువిందు చేయనుండడం తో ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.
Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!
అయితే తాజా సమాచారం ప్రకారం, మాస్ జాతర సినిమా జూలై 18, 2025న థియేటర్లలో విడుదల కానుంది. మొదట మే 9న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమా వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ఏప్రిల్ 14న శుభారంభం కానుంది. 'తూ మేర లవర్' అనే ఎనర్జిటిక్ డాన్స్ నెంబర్‌ను ఆ రోజున విడుదల చేయనున్నారు. ఈ పాటకు ఇప్పటికే మంచి క్రేజ్ ఏర్పడుతోంది.
Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!
‘చూపులతో గుచ్చి గుచ్చి’ పాట రీమిక్స్..
ఇక రవి తేజ ఫ్యాన్స్ కోసం ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా ఉంది. రవితేజకు 'ఇడియట్' సినిమాలో అదిరిపోయే పాపులర్ సాంగ్‌గా నిలిచిన ‘చూపులతో గుచ్చి గుచ్చి’ పాటను ఈ సినిమాలో రీమిక్స్‌గా వినిపించనున్నారు.
Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!
ఈ చిత్రంలో రవితేజ RPF (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) ఆఫీసర్‌గా కనిపించనున్నాడు, ఇది ఆయన కెరీర్‌లో విభిన్నమైన పాత్రగా నిలవనుంది. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. ఈసారి రవితేజ తన మాస్ శైలిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. మాస్ జాతరతో ఆయన మళ్లీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాడేమో చూడాలి!