నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న ప్రాజెక్టులలో 'ది గర్ల్ ఫ్రెండ్' ఒకటి. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మెయిన్ లీడ్ గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ''నాదివే''.. సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. హేశం అబ్దుల్ వహాబ్ కంపోజ్ చేసి పాడిన ఈ రొమాంటిక్ మెలోడీ వినసొంపుగా ఉంది. ఇందులో రష్మిక, దీక్షిత్ శెట్టి డాన్స్ మూవ్స్, కెమిస్ట్రీ ఆకట్టుకుంటున్నాయి. పూర్తి వీడియో సాంగ్ రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ పాట తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం అన్ని భాషల్లో రిలీజ్ అయింది.
Also Read : అందంతో అగ్గి రాజేసున్న బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ లుక్స్.. హాట్ ట్రీట్ అదిరిందిగా!
Dheekshith and I worked extremely hard for this one.. didn’t we @Dheekshiths 😄
— Rashmika Mandanna (@iamRashmika) July 15, 2025
I hope you guys like it 🫶🏻❤️ stay tuned tomorrow ❤️https://t.co/tAHvGioBmK#Nadhive#HuiRe#Nadhiye#Nilave#Swarave@23_rahulr@GeethaArts@HeshamAWMusic#AlluAravind#VidyaKoppineedi… pic.twitter.com/OVustHZmKz
త్వరలోనే విడుదల తేదీ
ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కథ రష్మిక ప్రేమ జీవితం, ఆమె ఎదుర్కొనే భావోద్వేగ సవాళ్ల చుట్టూ తిరుగుతుంది. ఇది కేవలం ప్రేమ కథ మాత్రమే కాదని లోతైన భావోద్వేగాలను చూపించే కథగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై విద్యా కొప్పినేడి, ధీరజ్ మొగిలినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక జోడీగా 'దసరా' నటుడు దీక్షిత్ శెట్టి మేల్ లీడ్ గా నటిస్తున్నాడు. రావు రమేష్, రోహిణి, అనూ ఇమ్మాన్యుయేల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
telugu-news | the-girlfriend | actress-rashmika-mandanna