/rtv/media/media_files/2025/09/16/rashmika-mandanna-cocktail-2-2025-09-16-11-48-11.jpg)
Rashmika Mandanna Cocktail 2
Rashmika Mandanna: రష్మిక మందన్న సౌత్ లోనే కాదు, ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తనదైన గుర్తింపుతో దూసుకుపోతున్నారు. తెలుగు, కన్నడ సినిమాలతో స్టార్ ఇమేజ్ పొందిన రష్మిక, ఇప్పుడు హిందీ ప్రేక్షకులకి దగ్గరవుతోంది. ఇటీవల ఆమె నటించిన హిందీ చిత్రం 'ఛావా' మంచి విజయం సాధించడంతో, బాలీవుడ్‌లో ఆమెకి మంచి డిమాండ్ ఏర్పడింది.
handsome shahid kapoor beautiful😍✨ kriti sanon khoobsurat rashmika mandanna cocktail 2 shoot begins #OCDTimes#ShahidKapoor#KritiSanon#RashmikaMandanna#Cocktail2#HomiAdajania#MaddockFilms#DineshVijan#LuvRanjanpic.twitter.com/WIDK1S0tpd
— BollyMomSon (@bollymomsun) September 16, 2025
ప్రస్తుతం రష్మిక, హిందీలో 'థామ'(Thama) అనే హారర్ కామెడీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆమె మరో భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్లు తెలిసింది. ఇది కూడా నార్మల్ మూవీ కాదు, హిందీ సినీ ప్రేమికుల హృదయాల్లో ప్రత్యేక స్థానం పొందిన క్లాసిక్ రొమాంటిక్ డ్రామా 'కాక్‌టెయిల్' కు సీక్వెల్.
Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!
'కాక్‌టెయిల్ 2' కోసం రెడీ ..(Rashmika Mandanna in Cocktail 2)
2012లో విడుదలైన 'కాక్‌టెయిల్' సినిమా సైఫ్ అలీ ఖాన్, దీపికా పడుకొణె, డయానా పెంటీ లను ప్రధాన పాత్రల్లో చూపిస్తూ, ప్రేమ, స్నేహం, సంబంధాల మధ్య జరిగే కథను ఆధారంగా తీసుకొని మంచి విజయం సాధించింది. ముఖ్యంగా యూత్ ఈ మూవీకి బాగానే కనెక్ట్ అయింది. ఇప్పుడు అదే ఫ్రాంచైజీకి 'కాక్‌టెయిల్ 2' పేరుతో సీక్వెల్ రూపొందిస్తున్నారు.
ఈ సీక్వెల్‌లో షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గత కొంతకాలంగా ఈ సినిమాలో రష్మిక ఉండబోతున్నట్లు టాక్ వినిపించినా, ఏ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
Also Read: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?
ఇన్‌స్టాగ్రామ్ పోస్టుతో కన్ఫర్మేషన్..
ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైందని సమాచారం, తాజాగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఆన్-లొకేషన్ ఫోటోలు షేర్ చేశారు. వాటితో పాటు ఆమె పెట్టిన క్యాప్షన్ "అపరిమితమైన వినోదానికి సిద్ధంగా ఉండండి!" అంటూ ఉండటం ఈ సినిమా గురించి మరింత ఆసక్తిని పెంచింది.
ఈ పోస్టుతో ఆమె 'కాక్‌టెయిల్ 2' లో నటిస్తోందని పక్కా అర్థమవుతోంది. అయితే ఆమె ఏ పాత్రలో కనిపించనున్నారు, ఆ పాత్ర ఎలా ఉంటుంది అనే విషయాల్లో ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈ సినిమా కోసం ఆమె కొత్త లుక్‌తో దర్శనమివ్వనున్నారు అన్న టాక్ వినిపిస్తోంది.
విడుదల తేదీ
2026 రెండో భాగంలో (జూలై–డిసెంబర్ మధ్యలో) ఈ సినిమా థియేటర్లలోకి రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 'కాక్‌టెయిల్' మొదటి భాగం వంటి భావోద్వేగాల మేళవింపుతో పాటు, ఈ తరం స్టార్స్‌ను తీసుకొని ఈ సీక్వెల్ రూపొందించడమే ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణం.
బాలీవుడ్ అభిమానులు మాత్రమే కాకుండా, తెలుగు ప్రేక్షకులు కూడా రష్మిక పాత్ర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే హిందీలో మంచి పాపులారిటీ సాధించిన రష్మిక, ఈ సినిమాతో హిందీ ఆడియన్స్ కు మరింత దగ్గర కానుంది.
రష్మిక మందన్న బాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటూ, స్టార్‌గా మారిపోయింది. తాజాగా 'కాక్‌టెయిల్ 2' వంటి పాపులర్ ఫ్రాంచైజీలో అవకాశం రావడం, ఆమె కెరీర్‌కు మైలురాయిగా నిలవబోతోంది. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి. రష్మిక అభిమానులకి ఇది తప్పకుండా గుడ్ న్యూస్!